రొమ్ము క్యాన్సర్ పై స్వచ్ఛంద ప్రచారం ... పింక్‌ రిబ్బన్‌ మాస్క్‌ పంపిణి !

Update: 2021-05-20 04:34 GMT
తెలంగాణ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొంచెం కొంచెం గా పెరుగుతుంది. కరోనా కట్టడికి ప్రభుత్వం ఇప్పటికే లాక్ డౌన్ , కర్ఫ్యూ ను అమల్లోకి తీసుకువచ్చినప్పటికి కూడా ఇంకా కరోనా వ్యాప్తి మాత్రం తగడ్డం లేదు. దీనితో నేటి నుండి రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ ఎం సి పరిధిలో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయబోతున్నారు. ఇక ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పేస్ మాస్క్ అనేది అందరి జీవితాల్లో ఓ భాగంగా మారిపోయింది. కానీ, ఇంకా కొందరు పేస్ మాస్కులు కూడా వాడటం లేదు. ఇదిలా ఉంటే .. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంతోపాటు రొమ్ము క్యాన్సర్‌ పై అవగాహన కల్పించేందుకు ఉషాలక్ష్మి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ అలాగే , కిమ్స్‌-ఉషాలక్ష్మి సెంటర్‌ ఫర్‌ బ్రెస్ట్‌ డిసీజెస్‌ హైదరాబాద్‌ పింక్‌ రిబ్బన్‌ మాస్క్‌ క్యాంపెయిన్‌ ను ప్రారంభించింది.

 బంగారు తెలంగాణలో కరోనా వైరస్ పింక్‌ రిబ్బన్‌ మాస్క్‌ పేరుతో చేపట్టిన ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా నారాయణ రావు పేట మండలంలోని 10 గ్రామాల్లో రెండు రోజుల్లో 20వేల మాస్కులను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు బుధవారం ఇంబ్రహీంపూర్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు  మాట్లాడుతూ.. ఇబ్రహీంపూర్‌ ను దత్తత తీసుకొని ఆరు , ఏడేళ్లుగా  గ్రామ అభివృద్ధికి కృషిచేస్తున్న డాక్టర్‌ పీ రఘురామ్‌ కి అభినందనలు తెలిపారు. పింక్‌ రిబ్బన్‌ మాస్క్‌ కార్యక్రమం ద్వారా పంపిణీ చేయనున్న మాస్కులను మహిళా స్వయం సహాయక బృందాల  తో తయారు చేయించడం హర్షణీయమన్నారు. డాక్టర్‌ రఘురామ్‌ మాట్లాడుతూ.. సిద్దిపేట నియోజకవర్గంలోని 90 గ్రామాల్లో మాస్కులను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.   దేశంలో కరోనా మహమ్మారితో  క్యాన్సర్ చికిత్స లో భారీగా నష్టపోయింది. భారతదేశంలో క్యాన్సర్ ప్రభావితం చేసే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ సర్వసాధారణం. కరోనా  సంక్షోభం కారణంగా, వారు వైద్యులను కలుసుకునే అవకాశం  బాగా పడిపోయింది. ప్రాధమిక అంచనా ప్రకారం ..  ఇప్పటికే 60 శాతానికి పైగా అత్యంత దుర్భరమైన జీవనాన్ని గడుపుతున్నారని అన్నారు.   దేశంలో ప్రస్తుత దురదృష్టకర పరిస్థితులతో ఈ పరిస్థితి ఇంకా పెరిగే అవకాశం ఉందని , అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.  

ఈ వ్యాధిపై అవగాహన లేకపోవడం, ముందస్తు వ్యాధి నిర్ధరణ పరీక్షలు సకాలంలో చేయకపోవటం వల్ల రొమ్ము క్యాన్సర్తో అధిక శాతం మంది మహిళలు వ్యాధి బాగా ముదిరిన తర్వాతే వైద్యులను సంప్రదిస్తున్నారు. ఇప్పటికీ ఈ సమస్య బహిరంగంగా చర్చించుకునే అంశంలా లేదు. అందుకే.. రొమ్ము క్యాన్సర్ గురించి సరైన సమాచారం అందుబాటులో ఉంచి, సిగ్గు పడకుండా ఈ వ్యాధి గురించి చర్చించుకోవటానికి, మహిళలకు మరింత స్వేచ్ఛ కలిగించటానికి డా.రఘురాం లాభాపేక్ష లేని ఉషాలక్ష్మీ రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్ను 2007 లో స్థాపించారు. పింక్ రిబ్బన్ వాక్ పేరుతో 2008 అక్టోబర్ నెలలో అంతర్జాతీయ బ్రెస్ట్ క్యాన్సర్ జాగృతి కార్యక్రమం సందర్భంగా ఉషాలక్ష్మీ ఫౌండేషన్ ర్యాలీ నిర్వహించింది. రొమ్ము క్యాన్సర్ ను ముందే కనుక్కోవటానికి మీ గుండె స్పందిస్తోందా అనే నినాదంతో ప్రారంభమైన పింక్ రిబ్బన్ వాక్ కార్యక్రమాలు గత కొన్నేళ్లుగా  సాగుతున్నాయి.
Tags:    

Similar News