ప్రాణాంతక వైరస్ కరోనా విశ్వవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను తునాతునకలు చేసేసింది. వందేళ్ల క్రితం అన్ని దేశాలను తీవ్రంగా ప్రభావితం చేసి గ్రేట్ డిప్రెషన్ కంటే కూడా కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థలు మరింతగా చిక్కిపోయాయి. గ్రేట్ డిప్రెషన్ నుంచి కోలుకునేందుకు ఏకంగా పదేళ్లకు పైగా సమయం పట్టింది. మరి గ్రేట్ డిప్రెషన్ కంటే మరింతగా ప్రభావితం అయిన మార్కెట్లను చక్కదిద్దేందుకు ఇంకెంత కాలం పడుతుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో యూరప్ కు చెందిన పలువురు ఆర్థిక వేత్తలు సంపద పన్నులు మాత్రమే కరోనా విలయం నుంచి ఆర్థిక రంగాలకు ఊతమిస్తాయని, ఇది తప్పించి మరో మార్గం లేదని సూచిస్తున్నారు. యూరప్ సంగతి సరే... అభివృద్ధి పథంలో తనదైన స్పీడుతో దూసుకెళుతున్న భారత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు లోతుగా ఆలోచనలు చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఇదే పన్ను విధానాన్ని అమలు చేయక తప్పదా? అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా తాను రద్దు చేసిన పన్ను విధానాన్ని మోదీ మళ్లీ తిరిగి అమల్లోకి తెస్తారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
తొలుత యూరప్ సంగతికి వెళితే... కరోనా కారణంగా చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి యూరప్‌లోని ధనవంతులపై సంపద పన్నును విధించాలంటూ ప్రముఖ ఆర్థిక వేత్తలు, ఎకానమీ బుక్స్ రచయితలు కమిల్లే లాండాయిస్, ఎమ్మాన్యుయల్ సేజ్, గాబ్రియల్ సుజ్‌మన్ 'ఏ ప్రొగ్రెసివ్ యురోపియన్ వెల్త్ టాక్స్ టు ఫండ్ ది యూరోపియన్ కోవిడ్ రెస్పాన్స్' పేరిట ఓ వ్యాసాన్ని ప్రచురించారు. వారి ప్రతిపాదనలను యూరోపియన్ యూనియన్ ప్రస్తుతం నిశితంగా పరిశీలిస్తోంది. ఈయూలో దీనిపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తుండగా... ఒకప్పుడు మన దేశంలో అమలులో ఉన్న సంపద పన్నును మళ్లీ అమలులోకి తీసుకురావడం ఖాయమేనా? అన్న చర్చలు ప్రారంభమయ్యాయి. నిజానికి సంపద పన్ను మన దేశానికి కొత్త కాదు. గతంలో అంటే 2016-17 ఆర్థిక సంవత్సరం వరకు మనదేశంలో సంపద పన్ను విధించేవారు. ప్రస్తుతం కరోనా దెబ్బకు భారత ఆర్థిక వ్యవస్థ పతనావస్థకు చేరుకుంది. దాంతో మరోసారి సంపద పన్ను అంశం మన దేశంలోను తెరమీదికి వస్తోంది. సంపద పన్నును విధించినట్లయితే కరోనా కాటు నుంచి ఆర్థిక రంగం కూడా త్వరగా కోలుకుంటుందన్న సూచనలు వినిపిస్తున్నాయి.
వివిధ లెక్కల ప్రకారం మనదేశంలో అత్యంత సంపన్నులు 953 మంది ఉన్నారు. వారి యావరేజ్ సంపద రూ.5, 278 కోట్లని అంచనా. వారి మొత్తం ఆదాయాన్ని కలిపితే రూ.50 లక్షల కోట్లకు పైగానే ఉంటుంది. భారత జాతీయ స్థూల ఉత్పత్తిని కరెన్సీలో లెక్కిస్తే రూ.190.5 లక్షల కోట్లని అంచనా. అంటే దేశ జాతీయ స్థూల ఉత్పత్తిని మనీలో లెక్కిస్తే అందులో అత్యంత సంపన్నుల వాటా 26.4 శాతంగా లెక్క తేలుతుంది. వీరి సంపదపై జస్ట్ 4 శాతం సంపద పన్ను విధించినా మొత్తం జీడీపీలో ఒక్క శాతానికి పైగానే డబ్బు సమకూరుతుంది. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు మోదీ ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ రూ.1.7 లక్షల కోట్లు మాత్రమే. ఈ మొత్తం జీడీపీలో ఒక శాతం కూడా కాదు. అత్యధిక ధనవంతులపై 4 శాతం పన్ను విధించినట్లయితే ఈ ఆర్థిక ప్యాకేజీ కన్నా ఎక్కువ డబ్బులే వసూలవుతాయి. పైగా నాలుగు శాతం పన్ను వారికేమాత్రం భారం కాదు. అందుకని ఈ ప్రతిపాదనను భారత ప్రభుత్వం కూడా పరిశీలించాలని మేధావులు, ఆర్థిక నిపుణులు కోరుతున్నారు. అయితే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తానే రద్దు చేసిన సంపద పన్నును తిరిగి తెచ్చేందుకు మోదీ సిద్దపడతారో లేదో వేచి చూడాలి.