కంటి ముందు కనిపిస్తూ..నిజాన్ని అబద్ధంగా.. అబద్ధాన్ని నిజంగా భ్రమించే సోషల్ మాయాజాలం ఎక్కువైంది. అందునా రాజకీయ ప్రయోజనం ఉన్నప్పుడు ఇలాంటి వాటికి మరింత మసాలా జోడించటం తెలిసిందే. తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ లో జరుగుతున్న పోరును యావత్ దేశం ఆసక్తిగా గమనిస్తోంది. ఇటీవల చోటు చేసుకున్న పలు పరిణామాల్ని చూస్తే.. బెంగాల్ ఫైట్ లో సినిమాటిక్ అంశాలు కనిపిస్తుండటం గమనార్హం.
తాను బరిలో ఉన్న నందిగ్రామ్ లో దీదీపై గుర్తు తెలియని దుండగులు చేసిన పనితో సీఎం మమత కాలికి ఫ్యాక్చర్ కావటం తెలిసిందే. అయితే.. ఇదంతా నాటకమని.. బెంగాలీల్నిభావోద్వేగానికి గురి చేసి.. ఓట్లు దండుకోవటానికి కొత్త ఎత్తు వేసినట్లుగా ప్రచారం సాగుతోంది. తమ వాదనకు బలం చేకూరేలా కొన్ని ఫోటోల్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అందులో.. మమత ఆసుపత్రిలో ఉన్న ఫోటోలో కాలు ఒక వైపున ఉంటే.. తాజాగా ప్రచారం చేస్తున్న వేళ.. కనిపిస్తున్న కాలికి సంబంధం లేదన్నట్లుగా ఉన్నాయి.
సంచలనంగా మారిన ఈ వైరల్ ఫోటల్లోని నిజానిజాల మాటేమిటన్న విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే.. దీదీని దెబ్బేయటానికి జరుగుతున్న కుట్రగా చెప్పాలి. ఆసుపత్రిలో కట్టు ఉన్న కాలి ఫోటోను తెలివిగా రోటేట్ చేయటం ద్వారా.. కుడి ఏడమగా చూపించే ప్రయత్నాన్ని చేస్తున్నారు. దీంతో.. ఆసుపత్రిలో ఒకలా.. బయట మరో కాలికి గాయమైనట్లుగా ‘దొంగ’ ప్రచారాన్ని చేస్తున్నట్లుగా చెప్పక తప్పదు.
ఇలాంటి ఫోటోలతో కన్ఫ్యూజ్ క్రియేట్ చేయటమే కాదు.. అబద్ధానని నిజంగా భ్రమించేలా చేసే దుర్మార్గానికి దీదీ ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారన్న మాట వినిపిస్తోంది. దీదీ గాయాన్ని అవహేళన చేసేలా సాగుతున్న ఈ దుర్మార్గ ప్రచారంపై మమత ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.