తెలంగాణ జల వినియోగంపై ఏపీ ఎంపీ అవినాష్ ఏమన్నారు? కేంద్రమంత్రి రియాక్షన్ ఏమిటి?
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం నేపథ్యంలో కేంద్రం బోర్డు ఏర్పాటు చేయటం తదితర అంశాలన్ని పాతవే. ఏపీపై ఆరోపణలు సంధిస్తూ.. తెలంగాణ అధికారపక్షమైన కేసీఆర్ సర్కారు విరుచుకుపడటం.. అంతలోనే ప్రాజెక్టు నీటితో విద్యుదుత్పత్తి చేపట్టటం.. దీనిపై ఏపీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేయటం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే తాజాగా జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో భాగంగా లోక్ సభలో కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కీలక ప్రశ్నల్ని సంధించారు. తెలంగాణ రాష్ట్రంలోని కేసీఆర్ సర్కారు చేపట్టిన పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అక్రమ నిర్మాణాన్ని ప్రశ్నించారు.
అంతేకాదు.. శ్రీశైలం ప్రాజెక్టులోని నీటిని సందర్భానికి ఏ మాత్రం సంబంధం లేకుండా విద్యుదుత్పత్తి కోసం వినియోగిస్తున్న తీరును తప్పు పట్టటమే కాదు.. దానికి సంబంధించిన పలు ప్రశ్నల్ని సంధించారు. గమనించాల్సిన కీలక అంశం ఏమంటే.. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వేసిన ప్రశ్నలకు కేంద్ర జల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఏకీభవిస్తూ సమాధానాలు ఇవ్వటం. తెలంగాణ తీరును తప్పు పట్టిన ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీస్తున్నాయి. లోక్ సభలో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో తెలంగాణ ఎత్తిపోతల ప్రాజెక్టు అయిన పాలమూరు - రంగారెడ్డితో పాటు.. అక్రమంగా నీటిని వినియోగిస్తున్న తీరుపైన పలు ప్రశ్నలు సంధించారు.
ఎంపీ అవినాష్ సంధించిన ప్రశ్నల్లో రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు.. నెల్లూరు.. ప్రకాశం జిల్లాలు.. చెన్నై నగరానికి నీటి విడుదల నిమిత్తం శ్రీశైలం డ్యామ్ లో కనీస నీటి మట్టాల్ని 854అడుగులుగా నిర్దేశిస్తూ 2004లో ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ స్థాయిలో నీరు ఉంటేనే ఆయా ప్రాంతాలకు నీటిని విడుదల చేసేందుకు సాధ్యమవుతుందని ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘తెలంగాణ జెన్ కో మాత్రం నీటిమట్టం 800 అడుగుల వద్ద ఉన్నప్పుడే విద్యుదుత్పత్తి చేపడుతోంది. తెలంగాణ విద్యుదుత్పత్తి చేపట్టకుండా నిలువరించాలని కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు లేఖ రాశారు. దీంతో విద్యుదుత్పత్తి ఆపాలని కేఆర్ఎంబీ ఇప్పటికే తెలంగాణ జెన్ కోకు కేంద్రం ఉత్తర్వుల్ని జారీ చేసింది. మరి.. వాటి ఆదేశాల్ని కచ్ఛితంగా అమలు అయ్యేలా చేస్తాయా? అని ప్రశ్నించారు.
ఎంపీ అవినాష్ రెడ్డి సంధించిన ప్రశ్నలకు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పందించారు. కడప ఎంపీ లేవనెత్తిన విషయాల్ని తాను ఏకీభవిస్తున్నట్లుగా వ్యాఖ్యానించటం గమనార్హం. ‘రాయలసీమ రైతులకు సంబంధించి సభ్యుడు లేవనెత్తిన అంశంతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నా. ఏపీ సీఎం రాసిన లేఖ నాకు అందింది. ఆయన కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు కూడా లేఖ రాశారు. నేరుగా తెలంగాణ జెన్‌కోకు లేఖ రాస్తూ విద్యుదుత్పత్తిని తక్షణం నిలిపివేయాలని అడిగాం. కానీ, తాము విద్యుదుత్పత్తి నిలిపివేయబోమని, మూడు ప్లాంట్లను పూర్తిస్థాయిలో ఆపరేట్ చేయాలని అనుకుంటున్నామని తెలంగాణ చెప్పింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి లేఖ రాసి విద్యుదుత్పత్తి నిలిపి వేసి ఉండాల్సిందని చెప్పాం’ అని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వ తీరును కేంద్రమంత్రి తప్పు పట్టిన వేళలోనే.. ఎంపీ అవినాష్ మరో అనుబంధ ప్రశ్నను సంధించారు. తెలంగాణ సర్కారు చేపట్టిన పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తోందని.. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఎస్ఆర్ బీసీ.. తెలుగు గంగ ప్రాజెక్టు.. కేసీ కెనాల్.. జీఎన్ఎస్ఎస్.. హెచ్ఎన్ఎస్ఎస్.. వెలిగొండ ప్రాజెక్టుల ఆయుకట్టపై ప్రభావం చూపుతుందన్నారు. మరి.. పాలమూరు - రంగారరెడ్డి పథకాన్ని ఆపేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇచ్చిన కేంద్రమంత్రి షెకావత్.. ‘‘రెండు రాష్ట్రాల ప్రయోజనాల్ని కాపాడేందుకు ఏపీ విభజన చట్టాన్ని అనుసరించి వ్యవస్థల్ని ఏర్పాటు చేశాం. దాన్ని అమలు చేస్తాం’’ అని పేర్కొన్నారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వినిపించే వాదనకు భిన్నమైన వాదనను కడప ఎంపీ వినిపించటం.. అందుకు కేంద్రమంత్రి సైతం సమర్థించటం గమనార్హం. మరి.. లోక్ సభలో చోటు చేసుకున్న ఈ పరిణామాలపై కేసీఆర్ ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఉత్కంఠగా మారింది.