సెకండ్ వేవ్ వేళ విరుచుకుపడిన డెల్టా వేరియంట్ కు మించిన డెల్టా ప్లస్ వేరియంట్ ఇప్పుడు కొత్త గుబులు పుట్టిస్తోంది. ఇంతకీ.. డెల్టాకు.. డెల్టా ప్లస్ కు మధ్య ఉన్న తేడా ఏమిటన్న సందేహం పలువురికి కలుగుతోంది. ఇదే విషయాన్ని సీసీఎంబీ శాస్త్రవేత్తల్ని ప్రశ్నిస్తే వారిచ్చే సమాధానం.. రెండింటికి మధ్య పెద్ద తేడా లేదని.. డెల్టా కు మించిన ప్రమాదకారి అని చెబుతున్నారు. ఇప్పటికే తిరుపతిలో ఈ వేరియంట్ కు సంబంధించిన కేసు ఒకటి గుర్తించారు. కాకుంటే.. సదరు వ్యక్తిలో డెల్టా ప్లస్ వేరియంట్ కనిపించిన తర్వాత.. మరిన్ని కేసులు వెలుగు చూస్తాయని భావించారు కానీ అలాంటిదేమీ జరగలేదు.
ఇదంతా చూస్తే.. డెల్టా ప్లస్ వేరియంట్ ఇప్పుడు చిన్నగానే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. దీన్ని నిర్లక్ష్యం ఎంతమాత్రం చేయకూడదని చెబుతున్నారు. నెమ్మదిగా మొదలై.. ఆ తర్వాత అంతటా వ్యాప్తి చెందుతుందని.. అందుకే.. దీని విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందే ముందే.. ప్రజలు, ప్రభుత్వాలు మరిన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ కట్టడికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
సెకండ్ వేవ్ వేళ ఎలాంటి నిర్లక్ష్యాన్ని అయితే ప్రదర్శించారో.. అలాంటిది మాత్రం వద్దని చెబుతున్నారు. ఈ వేరియంట్ జీనోమ్ సీక్వెన్సీ చేస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ డెల్టా ప్లస్ వేరియంట్ మ్యుటేషన్ బయటపడినట్లుగా చెబుతున్నారు. డెల్టా వేరియంట్ మాదిరే.. డెల్టా ప్లస్ వేరియంట్ కు కూడా వేగంగా వ్యాపించే అవకాశం ఉందని చెబుతున్నారు. రెండు నెలల క్రితమే డెల్టా ప్లస్ వేరియంట్ ను గుర్తించినట్లుగా సీసీఎంబీ చెబుతోంది.