వ‌లంటీర్ల రీకాల్ చేస్తే.. వైసీపీ ప‌రిస్థితి ఏంటి?

Update: 2021-12-14 06:37 GMT
ఏపీ ప్ర‌భుత్వానికి స‌ర్వ‌స్వం ఎవరు అంటే.. వెంట‌నే త‌డుము కోకుండా చెబుతున్న మాట‌.. వ‌లంటీర్లు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఏ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టాల‌న్నా.. ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌న్నా.. ప్ర‌జ‌ల నుంచి అభిప్రా యాలు సేక‌రించాల‌న్నా.. వ‌లంటీర్లే ఇప్పుడు ఏపీ స‌ర్కారుకుని అధునాత‌న ఆయుధం. ఒక్క ప్ర‌భుత్వాని కే వ‌లంటీర్ సేవ‌లు ప‌రిమితం కాలేదు. పార్టీకి కూడా విస్త‌రించ‌బ‌డ్డాయి. స‌మ‌యానికి అనుకూలంగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు ల‌క్ష‌ల మంది వ‌లంటీర్లు.. ఇటు ప్ర‌భుత్వ సేవ‌లోనూ.. అటు పార్టీలోనూ త‌రిస్తున్నారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో స్లిప్పులు పంచ‌డం.. పింఛ‌న్లు ఇచ్చేందుకు వెళ్లి.. పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారం చేయడం.. ఎలాంటి అవ‌కాశం ఉన్న్ప‌టికీ.. వ‌లంటీర్లు .. పార్టీకి కూడా ప‌నిచేసిపెడుతున్నారు. అయితే.. వీరి సేవ‌లు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలా ఉండ‌నున్నాయి? అనేది ఆస‌క్తిగా మారింది. ఇప్ప‌టికే వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌పై గుర్రుగా ఉన్న ప్ర‌తిప‌క్షాలు.. స్థానిక‌, ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లోనూ.. వ‌లంటీర్ల దూకుడుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో రాష్ట్ర హైకోర్టు.. వ‌లంటీర్ల‌ను అప్ప‌ట్లో క‌ట్ట‌డి చేసింది.

మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయ‌డ‌మో.. వారిని సుప్త చేత‌నావ‌స్థ‌లో ఉంచ‌డ మో చేయాల‌ని ఎవ‌రైనా కోర్టుకు వెళ్తే.. వ‌లంటీర్ల వ్య‌వ‌హారం ఇబ్బందుల్లో ప‌డే అవ‌కాశం ఉంది. అప్పుడు వైసీపీ ప‌రిస్థితి ఏంటి?  అనేది ప్ర‌శ్న‌.ఎందుకంటే.. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ వ‌చ్చిన త‌ర్వాత‌.. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు ప్రాధాన్యం లేకుండా పోయింది. ఎవ‌రినీ ప‌ట్టించుకునే ప‌నిలేకుండా పోయింది. నిజానికి ఎన్నిక‌ల స‌మ‌యంలో కార్య‌క‌ర్త‌లు అహ‌ర‌హం ప‌నిచేశారు. ఇప్పుడు మాత్రం పూచిక‌పుల్ల‌లుగా చూస్తున్నార‌ని వారు ఆవేద‌న ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

అందుకే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డ ఎన్నిక‌లు వ‌చ్చినా.. వైసీపీ నాయ‌కులు వ‌లంటీర్ల‌ను న‌మ్ముకుంటున్నారే త‌ప్ప‌.. కార్య‌క‌ర్త‌ల జోలికి వెళ్ల‌డం లేదు. కానీ, జ‌న‌ర‌ల్ ఎన్నిక‌లకు వ‌చ్చే స‌రికి.. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను ప‌క్క‌న పెట్టేస్తే.. అప్పుడు ఖ‌చ్చితంగా కార్య‌క‌ర్త‌ల‌పైనే ఆధార‌ప‌డాల్సి ఉంటుంది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న స‌మాచారం బ‌ట్టి.. కార్య‌క‌ర్త‌లు వైసీపీ పై గుర్రుగా ఉన్నారు. త‌మ‌కు పార్టీ అన్యాయం చేసింద‌ని.. త‌మ‌కు క‌నీసం విలువ కూడా ఇవ్వ‌డం లేద‌ని.. కార్య‌క‌ర్త‌లు వాపోతున్నారు. అంతేకాదు.. గ్రామాల్లో అయినా.. త‌మ కుటుంబానికి ఒక పింఛ‌న్‌, ఒక ఇల్లు కూడా ఇప్పించుకోలేక పోతున్నామ‌ని.. ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

గ‌తంలో టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌న్మ‌భూమి క‌మిటీల్లో కార్య‌క‌ర్త‌ల‌కు ప్రాధాన్యం ల‌భించేద‌ని.. అంతో ఇంతో రూపాయి కూడా వెనుకేసుకున్నార‌ని. కానీ.. వైసీపీ కార్య‌క‌ర్త‌లు కేవ‌లం జెండాలు మోసేందుకు, జై కొట్టేందుకు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌వుతున్నార‌ని.. ఆరోపిస్తున్నారు. అంటే.. ఒక ర‌కంగా మ‌న ప్ర‌భుత్వం వ‌స్తే.. ఏదైనా మ‌న‌కు ల‌బ్ధి జ‌రుగుతుంద‌ని భావించిన కార్య‌క‌ర్త‌ల‌కు ఇప్పుడు తీవ్ర నిరాశే ఎదుర‌వుతోంది. ఈ నేప‌థ్యంలో వారంతా.. కూడా వైసీపీకి వ్య‌తిరేకంగా ప‌నిచేసే అవ‌కాశాన్ని కూడా తోసిపుచ్చ‌లేం.

ఒక్క‌సారి వ్య‌తిరేక‌త అంటూ పెరిగితే.. ఇది పార్టీని ప‌త‌నం దిశ‌గా తీసుకువెళ్ల‌డం ఖాయ‌మ‌ని అంటున్నా రు ప‌రిశీల‌కులు. ప్ర‌భుత్వం ప్ర‌జ‌లకు అనేక కార్య‌క్ర‌మాలు చేస్తున్నప్పుడు.. వైసీపీని అధికారంలోకి తె చ్చేందుకు కార్య‌క‌ర్త‌లు చేసిన కృషిని గుర్తించి.. వారికి కూడా న్యాయం చేయాలిక‌దా. అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 
Tags:    

Similar News