దేశ ప్రధానికి టీకా వేసే అవకాశం వస్తే? అంతకు మించిన అవకాశమా? అని అనుకుంటాం కానీ టీకా వేసే వారి చేతులు వణికిపోతుంటాయి. ఏ మాత్రం తేడా వచ్చినా పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిందే కదా? తీవ్రమైన ఒత్తిడి.. అంతకు మించిన కంగారులో.. ఏ మాత్రం తేడా రాకుండా విధి నిర్వహణ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిని సమర్థంగా డీల్ చేశారు ఎయిమ్స్ నర్సు పి.నివేద. సోమవారం తెల్లవారుజామున ప్రధాని మోడీ అప్పటికప్పుడు అనుకొని వ్యాక్సిన్ వేసుకునేందుకు ఎయిమ్స్ కు వెళ్లటం.. ఆయనకు టీకా వేయటం తెలిసిందే.
అయితే.. టీకా వేసే సందర్భంలో ప్రధాని మోడీ అక్కడి వాతావరణాన్ని తేలిక పర్చేందుకు వీలుగా సరదాగా జోకు వేసిన వైనం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. ప్రధానికి టీకా వేయాల్సి రావటంతో.. వాతావరణం గంభీరంగా ఉండటాన్ని గుర్తించారు. ఇక.. టీకా వేయాల్సిన నర్సు పరిస్థితి అయితే చెప్పాల్సిన పనేలేదు. తీవ్రమైన టెన్షన్ తో ఉన్నారామె. దీంతో.. వాతావరణాన్ని తేలిక పర్చటానికి మోడీనే ముందుకు వచ్చి.. టీకా వేసే నర్సును పిలిచి మాట్లాడారు.
రాజకీయ నేతలకు తోలుమందం కదా.. మరి నాకు లావు సూది ఇస్తారా? అని అడిగారు. మోడీ చతురత అర్థం కాని నర్సు.. లేదని సమాధానమిచ్చారు. అయితే.. ఆమెకు అర్థం కాలేదన్న విషయాన్ని గమనించిన మోడీ మరింత వివరంగా విషయాన్ని చెబుతూ..రాజకీయ నాయకులకు తోలు మందం అని అంతా ఆరోపిస్తూ ఉంటారు కదా.. అందుకే నాకు టీకా వేయటానికి ప్రత్యేకమైన సూదిని ఏమైనా వాడుతున్నావా? అని అన్నారు.
దీంతో అక్కడ ఉన్న నర్సులంతా నవ్వేశారు. దీంతో వాతావరణం తేలికైంది. ఆ తర్వాత నర్సు మోడీకి టీకా వేశారు. దీంతో.. అప్పుడే అయిపోయిందా? నాకు కనీసం తెలియను కూడా తెలీలేదే? అని వ్యాఖ్యానించినట్లుగా చెప్పారు. మొత్తానికి తనకు టీకా వేసిన వేళలో ఉన్న టెన్షన్ వాతావరణాన్ని తేలికపరిచారు.