సబర్మతీ ఆశ్రమంలో ట్రంప్ ఏంచేశారంటే ...!

Update: 2020-02-24 09:30 GMT
భారత పర్యటనలో భాగంగా అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కి , స్వాగతం పలికిన ప్రధాని మోదీ, ఆ తరువాత అయనతో కలిసి రోడ్‌ షోలో పాల్గొన్నారు. ఎయిర్‌పోర్టు నుంచి మోతేరాలో నూతనంగా నిర్మించిన క్రికెట్‌ స్టేడియం వరకు 23 కి.మీ రోడ్‌ షోలో పాల్గొన్నారు. ఈ రోడ్ షో జరుగుతున్న సమయంలో మధ్యలో ట్రంప్ దంపతులు సబర్మతీ ఆశ్రమాన్ని సదర్శించారు. ఆశ్రమ నిర్వాహకులు ట్రంప్‌ దంపతులకు స్వాగతం పలికారు. ఆ తరువాత మహాత్మా గాంధీ చిత్రపటానికి ప్రధాని మోదీ, ట్రంప్‌ దంపతులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మోడీ , ఆశ్రమం గురించి కొన్ని విశేషాలని తెలిపారు.

కాగా , ఆశ్రమంలో అప్పట్లో రాట్నాన్ని వాడి నూలు ఎలా వాడికేవరో ట్రంప్ దంపతులకి మోడీ వివరించారు. రాట్నం పై నూలు వడకడం ఎలానో చెప్తుండగా ట్రంప్ దంపతులు చాలా ఆసక్తిగా గమనించారు. ఆ తరువాత కాసేపు ట్రంప్‌ చరఖాపై కాసేపు నూలు వడికారు. ఆ తరువాత ఆశ్రమం ప్రాంగణంలోని మూడు కోతుల బొమ్మను ట్రంప్ కు చూపిస్తూ ప్రధాని మోదీ దాని వెనకున్న కథను వివరించారు. గాంధీ మూడు కోతులుగా ప్రసిద్ధి చెందిన బొమ్మకు అర్థం... ‘‘చెడు వినవద్దు.. చెడు అనవద్దు.. చెడు కనవద్దు'' అని, వాటికీ దూరంగా ఉండాలంటూ గాంధీజీ తెలిపారని చెప్పుకొచ్చారు. ఆ తరువాత విజిటర్స్ బుక్ లో ట్రంప్‌ దంపతులు సంతకం చేశారు. ‘అద్భుతమైన సందర్శనకు అవకాశం కల్పించిన నా ఆత్మీయ మిత్రుడు నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు’ అని విజిటర్స్‌ బుక్‌లో ట్రంప్‌ రాసారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్ కోసం గుజరాతీ వంటలను రుచి చూపించారు. బ్రకోలి కార్న్‌తో చేసిన సమోసా, ఐస్‌ టీ, గ్రీన్ టీ, జింజర్ టీ, కొబ్బరి నీళ్లు, మల్టీ గ్రెయిన్‌ తో తయారు చేసిన బిస్కెట్లను ట్రంప్ దంపతులకు స్నాక్స్‌ గా అందించారు.


Tags:    

Similar News