ఉత్త‌రాంధ్ర గెలుపు క్రెడిట్ ఎవ‌రికి? టీడీపీలో గుస‌గుస‌..!

Update: 2023-03-19 19:00 GMT
ఉత్త‌రాంధ్రలోని ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌ల్లో టీడీపీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంది. చిరంజీవి రావు భారీ మెజారిటీతో విజ‌యం సాధించారు. అయితే.. ఇప్పుడు ఈ గెలుపు ఎవ‌రి ఖాతాలో ప‌డు తుంది? అనేది ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే.. అత్యంత కీల‌క‌మైన ఉత్త‌రాంధ్ర‌లో టీడీపీని ప‌క్క‌కు నెట్టి.. వైసీపీ పాగా వేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో అనూహ్యంగా టీడీపీ ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకోవ‌డం ఆస‌క్తిగా మారింది. ముఖ్యంగా విశాఖ‌ను  పాల‌నా రాజ‌ధాని చేస్తామ‌నిప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. గ్రాడ్యుయేట్లు గుండుగుత్త‌గా.. వైసీపీకే త‌మ‌ ఓట్లు కుమ్మ రించాలి. కానీ, అలా జ‌ర‌గ‌లేదు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. ఏక‌ప‌క్షంగానే సాగింద‌ని అనాలి. ఎక్కువ‌గా టీడీపీ వైపే మొగ్గు చూపించారు. ఈ ప‌రిణామాల‌తో టీడీపీ పుంజుకుంద‌న్న భావ‌న స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

అయితే.. ఇప్పుడు క్రెడిట్ ఎవ‌రికి ? అనే విష‌యాన్ని చూస్తే.. ఇక్క‌డ విశాఖ ఉత్త‌రం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు ఈ ఎన్నికల విజ‌యాన్ని త‌న భుజాల‌పైనే వేసుకున్నారు. అలాగ‌ని.. ఇత‌ర నేత‌లు వెల‌గ‌పూడి రామ కృష్ణ‌బాబు వంటి వారు.. అలాగే.. విశాఖ పార్ల‌మెంటు జిల్లా ఇంచార్జ్ భ‌ర‌త్ కూడా బాగానే క‌ష్ట‌ప‌డ్డారు. అయితే.. గంటా దూకుడు మాత్రం బాగా ప‌నిచేసిందనే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

కానీ, క్రెడిట్ తీసుకునేందుకు గంటా ప్ర‌య‌త్నం చేయ‌డం లేదు కానీ, ఆయ‌న అనుచ‌రులు మాత్రం క్రెడిట్ మొత్తం గంటా దేన‌ని ప్ర‌చారం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఇతర నాయ‌కులు మాత్రం  మొత్తంగా క్రెడిట్‌.. టీడీపీ దేన‌ని,. వైసీపీ వ్య‌తిరేక‌త కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంద‌ని వారు అంటున్నారు. ఈ ప‌రిణామాల క్ర‌మంలో .. ఎవ‌రికి వారు సైలెంట్‌గా ఉన్నారు. ఇక‌, చంద్ర‌బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

ఇందుకోసమే డొనాల్డ్ ట్రంప్ వచ్చే వారాంతంలో టెక్సాస్‌లో భారీ ర్యాలీ కోసం చేయాలని చూస్తున్నాడు. మరి ట్రంప్ ను అరెస్ట్ చేస్తారా? లేదా? అన్నది వేచిచూడాలి.

Similar News