ఇస్లామిక్ స్టేట్స్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా పేరుతో ప్రపంచాన్ని వణికించిన ఐసిస్ ఉగ్రవాద సంస్థ అధినేత అబుబాకర్ అల్ బాగ్దాది పేరు ఇప్పుడు ప్రపంచం మొత్తం మారుమోగిపోతుంది. తాజాగా బాగ్దాదిని అమెరికా మట్టుబెట్టిన విషయం తెలిసిందే. దీనితో అందరూ ఇప్పుడు అసలు ఈ బాగ్దాది ఎవరు ..ఐసిస్ లోకి ఎలా ఎంట్రీ ఇచ్చాడు. ఐసిస్ కీ అధినేతగా ఎలా మారాడు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ వివరాలని మనం ఇప్పుడు చూద్దాం..
ఇరాక్‌లోని సమర్రా ప్రాంతంలో 1971లో అబూ బకర్ అల్ బగ్దాదీ జన్మించాడు. ప్రస్తుతం అతని వయస్సు 48 ఏళ్ళు. బగ్దాదీ తండ్రి షేక్ అవాద్ ఇస్లామిక్ ధర్మ బోధకుడు. చదువులో అల్ బగ్దాదీ బాగా చురుగ్గా ఉండేవాడు. బాగ్దాద్ యూనివర్సిటీలో చేరి వైజ్ఞానిక, భాషా శాస్త్రాలు చదివాడు. ఇస్లామిక్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందాడు.సైన్యంలో చేరాలని కోరికగా ఉండేది. కానీ , కంటి సమస్య కారణంగా అతడిని సైన్యంలోకి తీసుకోలేదు. విద్యార్థి దశలో తోర్చీలోని మసీదులోని ఒక గదిలో ఒంటరిగా గడిపేవాడు. ఇరాక్‌పై 2003లో అమెరికా దాడి, సద్దాం హుస్సేన్‌ను పదవీచ్యుతుడిని చేయడం వంటి పరిణామాలు బగ్దాదీ ఆలోచనల్లో మార్పు తెచ్చాయి. ఆ సమయంలో అతడు షరియా మండలి పెద్దగా వ్యవహరించేవాడు. ఈ మండలి.. జమాత్ జైష్ అహిల్ ఎల్ సున్నీ అనే మిలిటెంట్ సంస్థను నడిపించేది.
ఈ సంస్థను 2006లో అతడు ముజాహిద్దీన్ సురా మండలిలో విలీనం చేసి.. ఆ మండలి అధ్యక్షునిగా ఎదిగాడు. ఆ హోదాలో ఖలీఫాగా అవతరించి, ఇస్లామ్‌కు పెద్ద దిక్కుగా ప్రకటించుకున్నాడు. ఈ మండలే 2006లో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, సిరియాగా పేరు మార్చుకుంది. అమెరికా జనాలకి సద్దాం పట్టుబడింది కూడా ఇదే సంవత్సరం. అప్పటి నుంచే అల్ బగ్దాదీ ఐసిస్ లో కీలకంగా మారాడు. ఈ సంస్థ వ్యవస్థాపకుడు అల్ ఒమర్ అల్ బగ్దాదీ 2010లో అమెరికా సేనల దాడిలో చనిపోయాక... ఐసిస్ కీ అధినేతగా మారిపోయాడు. తమ నాయకుడి పేరులోని అల్ బగ్దాదీని తన పేరుగా మార్చుకొన్నాడు. ఈ బగ్దాదీ కీ ఆడవారు అంటే చాలా ఇష్టం. రోజులో ఎక్కువ సమయం మహిళల మీద అత్యాచారం చెయ్యడానికి కేటాయించేవాడు.