ఎవరీ హిడ్మా.. పోలీసుల మోస్ట్ వాంటెడ్ మావో నేత

Update: 2021-04-05 07:30 GMT
భద్రతా బలగాలు వర్సెస్ మవోల మధ్య సాగిన భీకర పోరు సంచలనంగా మారింది. ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఈ కాల్పుల్లో 10-12 మంది మావోలు మరణిస్తే.. 22 మంది వరకు భద్రతా బలగాలు ప్రాణాలు పోగొట్టుకోవటం తెలిసిందే. ఈ భీకరదాడిలో కీలక వ్యూహకర్తగా హిడ్మాగా చెబుతున్నారు. ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ నెంబర్ వన్ బెటాలియన్ కు కమాండర్గా.. ఛత్తీస్ గఢ్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఇతడ్ని చెబుతున్నారు. తాజాగా జరిపిన దాడిలో దాదాపు 250 మంది మావోలకు ఇతను సారథ్యం వహించినట్లుగా తెలుస్తోంది.

చదువుకున్నది తక్కువే అయినా.. మెరుపుదాడుల్లో అతనికున్న నేర్పు అసమాన్యమైనదిగా చెబుతారు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం ప్రస్తుత మావో పార్టీలో చేరారు. గెరిల్లా వార్ మెలుకువుల్ని నేర్పించటంలో ఇతనికున్న ప్రతిభ చాలా ఎక్కువగా చెబుతారు. కూంబింగ్ ఆపరేషన్లు జరిపే బలగాలపైనా.. సీఆర్ఫీఎఫ్ క్యాంపులపైనా మెరుపు వేగంగా దాడి చేయటం వెన్నతో పెట్టిన విద్యలా చెబుతారు. మావో పార్టీలో ఆర్ అండ్ డీ విభాగం ఇతనే మాస్టర్ మైండ్ గా చెబుతారు. దేశీయ ఆయుధాలతో పాటు.. ఐఈడీ బాంబుల్ని తయారీ చేయటంలో హిడ్మా పట్టు ఎక్కువట.

పార్టీ కేంద్ర కమిటీలో చేర్చుకోవాలన్న చర్చ జరిగినప్పటికీ.. వయసు తక్కువగా ఉండటంతో అతన్ని కొంత కాలం తర్వాత బాద్యతలు అప్పగించాలని భావించినట్లు చెబుతారు. ప్రస్తుతం హిడ్మా తల మీద రూ.40లక్షల రివార్డు ఉందని చెబుతారు. బీజేపీ ఎమ్మెల్యే భీమా మడవి హత్య కేసులో అతనికి ప్రత్యక్ష ప్రమేయం ఉందని చెబుతారు. భద్రతా బలగాలకు భారీగా నష్టం వాటిల్లేలా చేయటంతో ఇప్పుడితని మీద ప్రత్యేకంగా ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News