యావత్ దేశమంతా ఆసక్తిగా చూస్తున్న అవిశ్వాస చర్చ నేపథ్యంలో పలు ఆసక్తికర అంశాలు తెర మీదకు వస్తున్నాయి. దాదాపు పదిహేనేళ్ల తర్వాత అవిశ్వాసంపై చర్చ జరగటం.. నాలుగేళ్ల క్రితం తిరుగులేని అధిక్యతతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మోడీ.. నాలుగేళ్ల తన పాలన అనంతరం అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా.. అవిశ్వాసం తుది ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై ఎలాంటి ఆసక్తులు లేవు. ఎందుకంటే.. నేటికీ బీజేపీకి పూర్తిస్థాయి బలం ఉందన్నది తెలిసిందే. టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ పరిగణలోకి తీసుకొని మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు పెట్టటం తెలిసిందే.
తాజాగా జరుగుతున్న అవిశ్వాస తీర్మానం తర్వాత తటస్థంగా ఉండే పార్టీలెన్ని.. మోడీకి అనుకూలంగా ఓటు వేసే పార్టీలు ఎన్ని.. వ్యతిరేకించే పార్టీలు ఎన్ని? అన్న విషయంపై క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే.. కీలకమైన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్న వేళ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి ఎందుకు వెళ్లలేదన్నది ఆసక్తికరంగా మారింది.
తానుఢిల్లీకి వెళ్లిన వెంటనే.. తన పర్యటనపై అంచనాలు పెరగటం.. తనపై లేనిపోని నిఘా పెరుగుతుందన్న ఉద్దేశంతో పాటు.. మోడీపైన అవిశ్వాసం పెట్టటం.. ఆయనపైన విమర్శలు చేయటం మొత్తం తన రాజకీయ ప్రయోజనం కోసం మాత్రమే తప్పించి.. ఆయనపై యుద్ధం చేయటానికి ఎంతమాత్రం కాదన్నట్లుగా బాబు తీరు ఉంది. ఇదే విషయాన్ని గల్లా స్పీచ్ లోనూ చెప్పించారు.
చిన్న చిన్న విషయాలకే ఢిల్లీకి వెళ్లే బాబు.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా ఢిల్లీకి దూరంగా ఉండటాన్ని చూస్తే.. సీరియస్ నెస్ తగ్గించేందుకేనని చెబుతున్నారు. అవిశ్వాసాన్ని సీరియస్ గా తీసుకోవటం లేదన్న కొందరి వాదనకు బలం చేకూరేలా బాబు తీరు ఉందని చెబుతున్నారు. అవిశ్వాస తీర్మానం ఎట్టి పరిస్థితుల్లో వీగిపోవటం ఖాయమని.. అది తెలిసీ ఢిల్లీకి వెళితే.. అవమానభారం వెంటాడుతుందని.. అందుకే బాబు ఢిల్లీకి వెళ్లలేదన్న మాట వినిపిస్తోంది.