ఓన్లీ పూజ‌లు.. యాగాలు మాత్ర‌మే.. స‌భ ఎందుకు లేదు?

Update: 2019-06-21 06:26 GMT
ఒక భారీ ప్రాజెక్టును పూర్తి చేసి..అంగ‌రంగ వైభ‌వంగా దాని ప్రారంభోత్స‌వాన్ని నిర్వ‌హిస్తున్న‌ప్పుడు పెద్ద స‌భ పెట్ట‌టం.. త‌మ ఆనందాన్ని.. తాము సాధించిన విజ‌యాన్ని ప్ర‌ముఖంగా చెప్పుకోవ‌టం మామూలే. అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

రికార్డు స‌మ‌యంలో పూర్తి చేసిన కాళేశ్వ‌రం ప్రాజెక్టును ఈ రోజు ప్రారంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రి.. ఈ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబ‌రాలు చేయాల‌ని.. పండుగ మాదిరి వేడుక‌లు నిర్వ‌హించాల‌ని పిలుపునిచ్చారు కేసీఆర్. మ‌రింత హ‌డావుడి చేస్తున్న ఆయ‌న‌.. ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని కేవ‌లం పూజ‌ల‌కే ఎందుకు ప‌రిమితం చేస్తున్నార‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

ఇంత పెద్ద కార్య‌క్ర‌మం అయిన‌ప్పుటు భారీ స‌భ‌ను ఏర్పాటు చేసి.. సందేశం ఇస్తే ఆ లెక్క వేరుగా ఉంటుంది. కానీ.. అందుకు భిన్నంగా పూజ‌కే ప‌రిమితం కావ‌టం వెనుక అస‌లు కార‌ణం వేరే ఉందంటున్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి మేన‌ల్లుడు హ‌రీశ్ రావుకు ఎలాంటి క్రెడిట్స్ ఇవ్వ‌క‌పోవ‌టం తెలిసిందే.

అన్నీ తానై నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడేమీ కాన‌ట్లుగా ఉండ‌టం.. త‌న ప్ర‌స్తావ‌న లేకుండా ఉన్న తీరుపై హ‌రీశ్ ఏమ‌నుకుంటున్నార‌న్న విష‌యం అస్స‌లు బ‌య‌ట‌కు రావ‌టం లేదు. ఆయ‌న స‌న్నిహితులు సైతం నోరు విప్ప‌టం లేదు. అదే స‌మ‌యంలో ఆయ‌న్ను అభిమానించే వారు మాత్రం విప‌రీత‌మైన సానుభూతి వ్య‌క్త‌మ‌వుతోంది.

ఈ ప‌రిణామాల‌న్ని నిఘా వ‌ర్గాల ద్వారా తెలుసుకున్న కేసీఆర్‌.. స‌భ‌ను ఏర్పాటు చేయ‌టం ద్వారా కొత్త స‌మ‌స్య‌ల‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్లు అవుతుంద‌న్న భావ‌న‌లో ఉన్న‌ట్లు తెలిసింది. ఈ కార‌ణంతోనే ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా.. రోటీన్  కు భిన్నంగా వ్య‌వ‌హ‌రించి.. పూజ‌ల‌తో పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ విధానంలో హ‌రీశ్ ప్ర‌స్తావ‌న తేవాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌ని.. తేలేద‌న్న త‌ప్పును కూడా వేలెత్తి చూపించ‌లేర‌న్న మాట వినిపిస్తోంది. హ‌రీశ్ సంగ‌తి ఏమో కానీ.. ప్ర‌సంగాలు.. స‌భ లేకుండా భారీ ప్రాజెక్టును పూజ‌ల‌తో పూర్తి చేయ‌టం ద్వారా కొత్త ట్రెండ్ కు కేసీఆర్ షురూ చేసిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News