పవన్... ఎందుకా పనిచేశారు?
కొంతకాలంగా జనసేన పార్టీలో ఎగ్జామ్ సీజన్ నడుస్తోంది. ఎగ్జామ్ సీజన్ ఏంటి? అనుకుంటున్నారు. పవన్ వ్యవహారం అలానే ఉంది. కొత్త రాజకీయం.. కొత్త రాజకీయం... టిక్కెట్లు కావాలంటే అప్లికేషన్ వేసుకోండి. మా స్క్రీనింగ్ కమిటీ ముందు హాజరుకండి. మీ *సత్తా* చూపించండి... టిక్కెట్ పట్టండి అన్నట్లు ఒక డెడ్ లైన్ పెట్టి మరీ దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇది మీరు గమనించే ఉంటారుగా... ఆ డెడ్ లైన్ రేపే. అయినా పాపం పవన్ ... అందరూ టిక్కెట్ల కోసం ఎగబడుతారు అనుకుంటే నాలుగైదు జిల్లాల్లో మినహా మిగతా జిల్లాల్లో పెద్దగా అప్లికేషన్లు రాలేదట. మరి డేట్ పొడిగిస్తారో, లేదో రేపు తెలుస్తుంది.
ఈ సంగతలా ఉంచితే... మొన్నటి వరకు పవన్ ఎక్కడ కనిపించినా ఏ సభ పెట్టినా పక్కన ఆ కమ్యూనిస్టు నేతలు ఉండేవారు. వారితో తెగ చర్చలు జరిపేవారు పవన్. మరి ఏమైందో గాని కొంతకాలంగా అసలు వారు పవన్ తో పాటు కనిపించడం లేదు. అసలు వారిద్దరూ విడిపోతున్నట్లు ఎక్కడా ప్రకటించనూ లేదు. ఎవరికి వారు సైలెంటుగా ఉన్నారు. వారు ఎపుడైతే పవన్ పక్కన కనిపించడం మానేశారో అప్పటి నుంచే చంద్రబాబు పై పవన్ విమర్శలు వినిపించడం తగ్గిపోయాయి. మరి ఈ రెండు ఒకే సమయం నుంచి జరుగుతున్నాయంటే కారణం ఏమై ఉంటుంది?
పవన్ - చంద్రబాబు వ్యహారం మళ్లీ మొదటికి వచ్చిందా?
ఇద్దరూ కలిసిపోయారా?
ఈసారి కలిసే పోటీ చేస్తారా... లేదా డమ్మీ గేమ్ నడిపిస్తారా?
ఇలాంటి అనుమానాలు తెలుగు ప్రజలకు కలుగుతున్నాయి. వాస్తవానికి వాళ్లిద్దరికి కలవాలని ఉన్నా... మళ్లీ కలిస్తే టీడీపీకి అంతో ఇంతో లాభమే గాని జనసేనకు మాత్రం చావుదెబ్బ. ఇక ఎప్పటికీ ఆ పార్టీని నమ్మరు. పవన్ వెంట ఇక బలమైన నేతలు ఎన్నటికీ నడవరు. ఏ రోజుకైనా ఇది తోక పార్టీయే అవుతుందని ఎవరూ జనసేన వైపు చూడరు. అందుకే పవన్ సైలెంటుగా ఉన్నారు. అయితే, ఇద్దరు కలుస్తారనే గాసిప్‌లు వినిపిస్తున్నా... సరైన సమాచారం ఇప్పటికీ బయటకు రాలేదు. మరి చంద్రబాబు కూడా ఆల్రెడీ జిల్లాల వారీగా టిక్కెట్ల పంపకం మొదలుపెట్టిన నేపథ్యంలో వీరిద్దరు కలిసి పోటీ చేయడం దాదాపు అనుమానమే.