రాహుల్‌, బాబు, కేసీఆర్ ఒకేసారి దుబాయ్ ఎందుక‌బ్బా?

Update: 2019-01-05 06:08 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి, టీ ఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సుదీర్ఘ‌ కాలం త‌ర్వాత విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లనున్నారు. ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత చైనా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లి వ‌చ్చిన ఆయ‌న తాజాగా గల్ఫ్ దేశ‌మైన దుబాయ్ వెళ్ల‌నున్నారు.  ఆదివారం నుంచి ఈనెల 13 వరకు దుబాయ్‌ లో కేసీఆర్  పర్యటించనున్నారు. దుబాయ్‌ లో జరిగే ఇంటర్నేషనల్‌ ఇండిస్టీయల్‌ సమ్మిట్‌ లో ఆయన పాల్గొననున్నారు. సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన సలహాదారు డాక్టర్‌ రాజీవ్‌ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌ రావు, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, పురపాలక, పట్టణాభి వృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ కూడా దుబాయ్‌ కి వెళ్లనున్నారు.

విదేశీ ప‌ర్య‌ట‌న‌లంటే పెద్ద‌గా ఆస‌క్తి చూప‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ దుబాయ్ ప‌ర్య‌ట‌న ఆస‌క్తిక‌రంగా మారింది. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా ఇదే నెలలో దుబాయ్‌ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ పర్యటన వెనుక రాజకీయ కారణాలేమైనా ఉన్నాయా... అనే చ‌ర్చ‌ను ప‌లువురు ప్ర‌స్తావిస్తున్నారు.






Full View
Tags:    

Similar News