ప్రస్తుతం ఎంతో మంది ఉద్యోగులు.. కార్మికులు తమ ఉపాధి కోల్పోయి ఇంట్లోనే ఉంటున్నారు. జీతాలు లేక అల్లాడుతున్నారు. కూలీనాలి చేసుకునే వారు. ఇంట్లో పనిమనుషులు, మార్కెటింగ్, ఫార్మా,రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, బ్రోకింగ్ సహా ఎంతో మంది ఖాళీగా ఉంటున్నారు. నిబంధనలతో సోషల్ డిస్టేన్స్ తో వారి పనులను తెరవనిస్తే వారు పనిచేసుకొని బతుకుతారు.కానీ మన ప్రభుత్వాలు అలా చేయడం లేదు.
అయితే ఆదాయన్ని ఇచ్చి మద్యం షాపులను మాత్రం ఓపెన్ చేసి చోద్యం చూస్తోంది.. తక్కువ మందితో నడిచే చాలా కార్యాలయాలు ఉన్నాయి. వారిని పనిచేసుకునేలా సర్కార్ మినహాయింపులు ఇస్తే ఎంతో మంది జీవితాలు నిలబడుతాయి. కూలీలే కాదు.. మార్కెట్ లో వివిధ పనులు చేసుకునే ఉద్యోగులు, చిన్నా చితక దుకాణాలు, ఇతర మార్కెటింగ్ వారు ఏం పాపారో చేశారో పాలకులే చెప్పాలి. మద్యం దుకాణాల నిల్చునే మంది కూడా లేని కార్యాలయాలు ఎన్నో ఉన్నాయి. వారంతా కరోనా భయానికి సోషల్ డిస్టేన్స్ పాటించడానికి రెడీగా ఉన్నాయి. అయినా వారందరినీ ఇంట్లోనే కూర్చుండబెట్టి సర్కారులు చోద్యం చూస్తున్నాయి.
ముఖ్యంగా లాక్ డౌన్ కారణంగా పస్తులు ఉంటున్నారు ఇంట్లో పనులు చేసుకునే పనిమనుషులు. హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో వీరు ఇళ్లను పట్టుకొని ఇంట్లో పనులు చేస్తూ పొట్టపోసుకుంటారు. వీరు పనిచేస్తేనే పూటగడిచేది. మార్చిలో లాక్ డౌన్ వరకు వీరు చేశారు. ఆ నెల జీతం అందుకున్నారు. ఇక ఏప్రిల్, మే లాక్ డౌన్ తో ఇళ్లలో చేయలేకపోయారు. ఇక కరోనా భయానికి ఇంటి యజమానులు కూడా వీరిని వద్దన్నారు. దీంతో రెండు నెలలుగా పనిమనుషులకు జీతాలు లేక అల్లాడుతున్నారు.
మే 17వ తేదీవైపే ఇప్పుడు కోట్లాది మంది పనులు చేసుకునే వారు ఎదురుచూస్తున్నారు.. ప్రైవేటు ఉద్యోగులు, ఉపాధి పొందే వారు, చిన్నా చితక పనులు చేసుకునే వారు.. కూలీనాలీ చేసుకునే వారంతా మే 17 తర్వాతైనా తమను పనులకు అనుమతించాలని.. లేదంటే ఆకలి చావులు చావడం ఖాయమంటున్నారు. మరి మన సర్కార్ ఏం చేస్తుందన్నది వేచి చూడాలి.