అరుదుగా చోటు చేసుకునే కొన్ని వింతలు.. విచిత్రాలు ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ఇప్పుడు మేం చెప్పే ఈ ఉదంతం కూడా అలాంటి కోవకు చెందిందే. చాలా అరుదుగా జరిగే ఈ ఉదంతం ఇప్పుడు ప్రపంచం దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. కవలలుగా పుట్టిన ఇద్దరు చిన్నారుల మధ్య డెలివరీలో చోటు చేసుకున్న కొద్దిపాటి ఆలస్యం.. ఇద్దరి మధ్య ఏడాది తేడాను తీసుకొచ్చింది. కవలలు ఏంది? ఇద్దరి మధ్య ఏడాది వ్యత్యాసం ఏంటి? అన్న కన్ఫ్యూజన్ అక్కర్లేదు. అదెలానన్న విషయాన్ని చూస్తే..
బ్రాండన్ షే.. హోలీ ఆఫ్ గ్లెండేల్ ఇద్దరు దంపతులు. వారికి కొత్త ఏడాది కొత్త అనుభూతిని మిగిల్చింది. ప్రెగ్నెంట్ గా ఉన్న హోలీకి డిసెంబరు 31 అర్థరాత్రి వేళ నొప్పులు వచ్చాయి. చివరకు ఆమె డెలివరీ డిసెంబరు 31 అర్థరాత్రి 11.51 గంటలకు జరిగింది. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. ఆమె గర్భంలో ట్విన్స్ ఉండటం.. మొదటి శిశువు బయటకు వచ్చిన పది నిమిషాల తర్వాత.. రెండో శిశువు ఈప్రపంచంలోకి రావటంతో.. పది నిమిషాల వ్యవధిలో ఏడాది మారిపోయి.. ఇద్దరి కవలల మధ్య వ్యత్యాసం ఏడాది అన్నట్లుగా మారింది.
మొదటి శిశువు డిసెంబరు31, 2016 బర్త్ డేట్ కాగా.. రెండో శిశువు బర్త్ డేట్ జనవరి1, 2017గా అయ్యింది. కేవలం పది నిమిషాల వ్యత్యాసంతో పుట్టిన ఇద్దరి పిల్లల బర్త్ ఇయర్ మాత్రం ఏడాది తేడా కావటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/