హైదరాబాద్ శివారులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక మహిళ మిస్ కావటం ఇప్పుడు సంచలనంగా మారింది. జైపూర్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆమె.. ఎయిర్ పోర్ట్ బయటకు వచ్చి క్యాబ్ ఎక్కిన తర్వాత నుంచి అదృశ్యం కావటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం అర్థరాత్రి చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే.. యార్లగడ్డ సాయి ప్రసన్నను ఆమె భర్త జైపూర్లో విమానం ఎక్కించారు.
ఆమె హైదరాబాద్ చేరుకున్నారు. ఆమెను రిసీవ్ చేసుకోవటానికి ఆమె తండ్రి.. తమ్ముడు ఎయిర్ పోర్ట్ కు వచ్చారు. ఆమె కోసం వెయిట్ చేస్తున్నా.. ఆమె జాడ దొరకలేదు. దీంతో.. ఆమెకు ఫోన్ చేశారు. తాను ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చానని.. తాను క్యాబ్ లో ఇంటికి వస్తున్నట్లుగా చెప్పారు. వెంటనే.. ఆమెను క్యాబ్ దిగాల్సిందిగా వారు కోరారు.
ఇది జరిగిన కాసేపటికే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ కావటంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వారు సాయి ప్రసన్న విషయాన్ని ఆమె భర్తకు సమాచారం అందించారు. ఖమ్మంకు చెందిన మోహనరావు అనే వ్యక్తి మీద తనకు అనుమానం ఉన్నట్లుగా చెబుతున్నారు. దీంతో.. సాయి ప్రసన్న తండ్రి పోలీసులను ఆశ్రయించి.. తన కుమార్తె మిస్ అయిన వైనాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. ఎయిర్ పోర్టు సీసీ కెమేరాల్ని పోలీసులు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఈ కేసులో కీలకంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. సాయి ప్రసన్న ఆచూకీ కోసం ప్రస్తుతం గాలింపులు జరుపుతున్నారు.