కేరళలో కరోనా వింత - 19 సార్లు పాజిటివ్

Update: 2020-04-21 17:06 GMT
కరోనా కేసుల్లో వింత చోటుసుకుంది. కేరళలో 62 సంవత్సరాల ఓ మహిళకు కరోనా సోకింది. ఆమెకు ఎంతకీ తగ్గడం లేదు. రెగ్యులర్ గా చికిత్స అందిస్తూ ఉన్నారు. ఎన్ని సార్లు టెస్టులు చేసినా పాజిటివ్ వస్తూనే ఉంది. దీంతో 42 రోజులుగా ఆమె ఆస్పత్రిలోనే ఉంది. ఇలాంటి కేసు దేశంలో ఇదే మొదటిది. ఆమెకు ఇటలీ వ్యక్తి ద్వారా కరోనా సోకినట్టు అధికారులు వెల్లడించారు. ఇటలీలో కరోనా విజృంభణ చూస్తూనే ఉన్నాం. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల రేటు 5 శాతంగా ఉంటే... ఇటలీలో 12 శాతంగా ఉంది. మరి అక్కడి వైరస్ బలమైనదా? లేక... ఈ కేరళ మహిళ దేహంలో సమస్య ఉందా అన్నది తెలియడం లేదు.

ఎంతకీ ఆమెకు తగ్గకపోవడంతో ప్రత్యేక చికిత్సను అందిస్తున్నారు. ఆమెకు ఆహారం నుంచి వైద్యం వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇంతకీ ఆమెకు ఎన్నిసార్లు పాజిటివ్ వచ్చిందో తెలుసా... 19 సార్లు. ఇంతగా దేశంలో ఎవరినీ కరోనా పట్టి పీడించలేదు. విచిత్రం ఏంటంటే... ఆమెకు కరోనా లక్షణాలు బయటకు ఏమీ కనిపించడం లేదు. ప్రస్తుతం ఆమె కోళంచెరి ఆస్పత్రిలో ఉన్నారు. ఇంకోసారి పాజిటివ్ వస్తే కొట్టయం మెడికల్ కాలేజీకి ఆమెను తరలిస్తామని వైద్యులు చెబుతున్నారు.
Tags:    

Similar News