ఇక అంతా అయిపోయింది. ప్రచారానికి మరొక రోజు మిగిలి ఉంది. రేపటితో మైకుసెట్టు కట్టేయాల్సిందే. నేతలంతా తమ తమ సొంతూళ్లకు పయనం కావాల్సిందే. తమ ఓటు ఉన్న చోటకు చేరుకోవాల్సింది. ఆ తర్వాతి రోజు ప్రచారానికి విరామం. ఆ పై పోలింగ్.
జనాల మూడ్ ఏమిటనే విషయం గురించి పరిశీలిస్తే.. జనాలు అప్పుడే అంతా అయిపోయింది,ఇక మిగిలింగ్ పోలింగే అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రచార పర్వం ముగుస్తున్న మూడ్ వారిలో కనిపిస్తూ ఉంది. అయితే నారా లోకేష్ కు మాత్రం ప్రచారపర్వంలో ఇంకా నిలదీతలే ఎదురవుతుండటం విశేషం.
మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన నారా లోకేష్ ఇప్పటికే ప్రచార పర్వంలో వివిధ రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పలు చోట్ల నోరు జారి ఇరకాటంలో పడ్డాడు చంద్రబాబు నాయుడి తనయుడు. పోలింగ్ తేదీని తప్పు చెప్పడం, ఆతర్వాత కౌంటింగ్ తేదీని కూడా తప్పే చెప్పడం.. వంటి పరిణామాలు సహజంగానే లోకేష్ పై ఉండిన అంచనాలను తగ్గించి వేశాయని పరిశీలకులు అంటున్నారు.
లోకేష్ ఐటీ శాఖా మంత్రి తోపు, తురుము..ఎమ్మెల్యే అయితే అభివృద్ధి సాధించేస్తారని అనుకోవడానికి లేకుండా చేస్తున్నాయి ఆయన నాలుక తడబాట్లు! వాటి సంగతలా ఉంటే.. తాజాగా మంగళవారం ప్రచారంలో లోకేష్ కు మంగళగిరిలో నిలదీత తప్పలేదు.
ల్యాండ్ పూలింగ్ బాధితురాలు ఒకరు లోకేష్ ను నిలదీసిన వైనం వార్తల్లోకి వచ్చింది. తమ భూమిని ప్రభుత్వం తమకు యిష్టం లేకుండా స్వాధీనం చేసుకుందని, ఇంటి స్వాధీనానికి కూడా నోటీసులు ఇచ్చిందని సదరు మహిళ లోకేష్ తో అన్నారు. ఈ రకంగా నిలదీశారు.
ఒకవైపు రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చెప్పుకొంటూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో పోలింగ్ కు వేళయ్యాకా కూడా స్వయానా చంద్రబాబు నాయుడి తనయుడికి ఇలాంటి నిలదీత ఎదురవ్వడం విశేషమే!