యాహూ పేరు ఇక మీకు క‌నిపించ‌దు

Update: 2017-04-05 07:54 GMT
టెక్నాలజీ పెరిగిపోతున్న స‌మ‌యంలో ఇప్పుడంటే ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది జీమెయిల్ వాడుతున్నారు. కానీ ఒకప్పుడు ఈ-మెయిల్ సేవలను అందించడంలో అగ్రస్థానంలో కొనసాగింది యాహూ (Yahoo). కేవలం ఈ-మెయిల్ మాత్రమే కాదు, సెర్చ్ ఇంజిన్, వార్తలు వంటి అనేక సేవలను నెటిజన్లకు యాహూ అందించింది. అయితే ఇకపై యాహూ అనే పేరు గతమే కానుంది. ఎందుకంటే ఆ సంస్థను కొనుగోలు చేసిన వెరిజాన్ యాహూ పేరును మార్చనుంది.

ఇంతకీ యాహూ కొత్త పేరు ఏంటో తెలుసా..? ఆల్టాబా..! (Altaba). ఇకపై ఇదే పేరుతో యాహూ మనకు దర్శనమివ్వనుంది. ఇదే విషయాన్ని ఏవోఎల్ (AOL) సీఈవో టిమ్ ఆర్మ్‌స్ట్రాంగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఏవోఎల్ అనేది వెరిజాన్‌లో ఓ భాగం. యాహూలాగే గతంలో ఏవోఎల్ కూడా వెరిజాన్‌లో కలిసిపోయింది. అయితే యాహూకు చెందిన ప్రధాన ఆస్తులకు ఏవోఎల్‌ను కలిపి ఓత్ (Oath) అనే కొత్త బ్రాండ్‌ను కూడా వెరిజాన్ ఆవిష్కరించనుంది. యాహూ, ఏవోఎల్‌లలోని కంటెంట్ డివిజన్‌ను ఓత్‌గా వ్యవహరించనున్నారు. కానీ యాహూ మెయిల్ మాత్రం మనకు ఇకపై అల్టాబాగా కనిపించనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News