జనసేన అధినేత తన ఎన్నికల మేనిఫేస్టోను విడుదల చేశారు. అయితే.. ఆయన చేసిన మేనిఫేస్టోలో అస్పష్టత కొట్టొచ్చినట్లు కనిపించటమే కాదు.. ఆచరణకు సాధ్యం కాని అంశాలు చాలానే కనిపిస్తున్నాయి. పవన్ హామీల్లో చాలావరకూ కేంద్రం నెరవేర్చాల్సినవే తప్పించి.. రాష్ట్రాలు తమకు తాముగా చేయలేని వాటిని ఎన్నికల హామీలుగా పవన్ ప్రస్తావించటం విశేషం. తమ పార్టీ సిద్దాంతాలు ఏడుగా చెబుతూ.. ఎన్నికల సందర్భంగా ప్రజలకు తామిచ్చే హామీలు అంటూ పేర్కొన్న అంశాలు ఆసక్తికరంగా లేవన్న విమర్శను మూటగట్టుకున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. జనసేన అధినేత పవన్ విడుదల చేసిన ఎన్నికల మేనిఫేస్టోలో చాలా వరకూ ఇప్పటికే తాము అమలు చేస్తున్నామని ఏపీ మంత్రి యనమల మండిపడ్డారు. తాము అమలు చేస్తున్న కార్యక్రమాల్ని కాపీ కొట్టి పవన్ తన ఎన్నికల హామీల్ని వెల్లడించారన్నారు.
పవన్ విడుదల చేసిన పార్టీ సిద్ధాంతాలు.. ఎన్నికల హామీలను చూస్తే..
జనసేన ఏడు సిద్దాంతాలు ఇవే..
1. కులాలను కలిపే ఆలోచనా విధానం.
2. మతాల ప్రస్తావన లేని రాజకీయం.
3. భాషలను గౌరవించే సంప్రదాయం.
4. సంస్కృతులను కాపాడే సమాజం.
5. ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం.
6. అవినీతిపై రాజీలేని పోరాటం.
7. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం.
ఎన్నికల హామీల్లో ప్రధానమైనవి..
+ మహిళలకు 33శాతం రాజకీయ రిజర్వేషన్లు
+ గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు
+ రేషన్‌కు బదులు మహిళల ఖాతాల్లో రూ.2500-3500 మధ్య నగదు జమ.
+ బీసీలకు అవకాశాన్ని బట్టి రాజకీయంగా 5శాతానికి రిజర్వేషన్ల పెంపు.
+ చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు.
+ కాపులకు 9వ షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్ల కల్పన.
+ ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం.
+ ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి కార్పోరేషన్.
+ ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల విద్యార్థులకు వసతిగృహాలు.
+ ముస్లింల అభివృద్ధికి సచార్ కమిటీ విధానాలు అమలు.
+ ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ విధానం రద్దు.
+ వృద్ధుల కోసం ప్రభుత్వ ఆశ్రమాలు.
జనసేన విజన్ డాక్యుమెంట్ ఏ మాత్రం కొత్తగా లేదన్న మాట బలంగా వినిపిస్తోంది. రేషన్ కు బదులుగా నగదు బదిలీ అంశం కొత్తది ఎలా అవుతుందన్న సందేహాల్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అగ్రవర్ణాలకు కార్పొరేషన్ పాత అంశమే కదా? అని ప్రశ్నిస్తున్నారు.
ఈ విమర్శలు.. ఆరోపణల్నిపక్కన పెడితే.. మంగళవారం ఉదయం భీమవరంలోని మావుళ్లమ్మనుదర్శించుకున్న పవన్.. తమ పార్టీ ప్రాథమిక విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేశారు. ఏడు సిద్ధాంతాలు.. 12 హామీలను పొందుపర్చినట్లుగా పవన్ చెప్పారు. జనసేన విజన్ డాక్యుమెంట్ లో ఆసక్తికర అంశాలు ఉంటాయని భావించిన పలువురు నిరాశ చెందటం గమనార్హం.