ఏది ఏమైనా.. విడ్డూరం లాంటి వ్యవహారాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు ఏపీ అధికార వైసీపీ నేతలు. పార్టీ పెట్టిన తర్వాత అధికారం కోసం వారు పడిన ఆరాటం సంగతి ఎలా ఉన్నా.. పవర్లోకి వచ్చిన ఈ మూడేళ్లలో ఏపీ ప్రజలకు మాత్రమే కాదు.. పక్కనున్న తెలంగాణ ప్రజలు సైతం.. ‘ఔరా’ అనుకునేలా చేయటంలో జగన్ అండ్ కో కు మించినోళ్లు వేరే వారు ఉండరనే చెప్పాలి.
దారిన పోయిన దానయ్య మాత్రమే కాదు.. సాయం అన్నంతనే ముందుకు ఉరుకులాడుతూ వచ్చే వారు సైతం.. కొన్ని విషయాలకు చాలా దూరంగా ఉంటారు. తోపు లాంటి నేతలు సైతం సంయమనం పాటిస్తారు. అలాంటిది.. తన దగ్గర డ్రైవర్ గా పని చేసిన ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణిస్తే.. ఆసుపత్రికి పంపకుండా.. నేరుగా తన కారులో వెనుక సీట్లు పడుకోబెట్టుకొని.. బాధితుడి ఇంటికి వచ్చి.. డెడ్ బాడీని తీసుకోవాలని చెప్పటం మాత్రం వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబుకే చెల్లుతుందని చెప్పాలి.
దీనిపై జరిగిన రగడ ఒక ఎత్తు అయితే.. పోస్టుమార్టం రిపోర్టులో ఎమ్మెల్సీ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మరణం.. కచ్ఛితంగా హత్యేనని.. ప్రమాదంలో గాయపడి మరణించలేదని తేల్చటం తెలిసిందే. మర్మాంగం మీద బలంగా కొట్టటం ద్వారా మరణించినట్లుగా పోస్టు మార్టం నివేదికలో వెలుగు చూసినట్లుగా వార్తలు వచ్చాయి. డెడ్ బాడీని బాధితుడి ఇంటికి ఎమ్మెల్సీ తన కారులో తీసుకెళ్లటం ఒక ఎత్తు అయితే.. హత్య అని పోస్టుమార్టం రిపోర్టు తేల్చిన తర్వాత కూడా సదరు ఎమ్మెల్సీని అరెస్టు చేయకపోవటం పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తోంది.
ఇలాంటి వేళ.. సీనియర్ నేత కమ్ మాజీ ఎంపీ హర్షకుమార్ ఈ ఉదంతంపై సంచలన ఆరోపణలు చేశారు. సుబ్రహ్మణ్యం మరణంపై హైకోర్టు కలుగజేసుకోవాలని.. సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. అమలాపురంలో నిర్వహించిన మీడియా భేటీలో మాట్లాడిన ఆయన.. హత్యారోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంత కళ్ల ముందు తిరుగుతున్నా.. అతడ్ని పట్టుకునేందుకు పోలీసులు సాహసించటం లేకపోవటంపై విస్మయాన్ని వ్యక్తం చేశారు.
దీనికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి.. మంత్రి వేణుగోపాల్ క్రిష్ణకు.. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఎమ్మెల్సీ అనంత బాబు బినామీ అని ఆరోపించారు. ఈ కారణం చేతనే అతన్ని అదుపులోకి తీసుకోవటానికి పోలీసులు వెనుకాడుతున్నట్లు పేర్కొన్నారు.
అంతేకాదు.. ఏజెన్సీలో గంజాయి నుంచి గనుల వరకు అన్ని అక్రమాలు ఎమ్మెల్సీ అనంత బాబు కనుసన్నల్లోనే జరుగుతుంటాయని.. వీటికి సంబంధించిన అన్ని రహస్య స్థావరాలు డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి తెలుసన్నారు. దీనికి సంబంధించిన వివరాల్ని బాధితుడు అక్కడక్కడా మాట్లాడుతుండటంతో.. అతన్ని చంపేశారన్నారు. ఒక ఎమ్మెల్సీ తీసుకెళ్లి.. చంపేసి తీసుకురావటం అంటే.. అతడికి ఏ స్థాయిలో మద్దతు లేకపోతే ఇలా చేస్తాడన్న హర్షకుమార్ మాటలు ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు..నిజమే కదా? అన్న సందేహం కలిగేలా ఉన్నాయని చెప్పక తప్పదు.