యోగి ప్ర‌యాణం..స‌వాళ్లమ‌యమండీ బాబూ!

Update: 2017-09-21 04:53 GMT
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ సీఎం అభ్య‌ర్థిగా యోగీ ఆదిత్య‌నాథ్‌ ను ప్ర‌క‌టించ‌గానే.. `స‌న్యాసిని సీఎం చేయ‌డ మేంటి?` అని ఆశ్చ‌ర్య‌పోయిన వాళ్లు లేక‌పోలే దు! హిందుత్వ వాదాన్ని న‌ర‌న‌రానా జీర్ణించుకున్న ఆయ‌న.. అత్యంత కీల‌క‌మైన.. అందులోనూ అల్ల‌ర్లు - ముస్లిం ఓట‌ర్లు అత్య‌ధికంగా ఉన్న రాష్ట్రాన్ని ఎలా ప‌రిపాలిస్తార‌న్న సందేహాలు అంద‌రిలోనూ వినిపించాయి. ఎన్నో అంచ‌నా లు .. మ‌రెన్నో ఆశ‌లతో యూపీ సీఎంపైకి ఎక్కిన ఆయ‌న పాల‌న‌లో త‌న మార్కు చూపించారు. దూకుడు నిర్ణ‌యాల‌తో ఇత‌ర సీఎంల‌కు రోల్ మోడ‌ల్‌ గా నిలిచారు. అయితే ఆరు నెల‌లు గ‌డిచిపోయాయి. మరి ఈ స‌మ‌యంలో ఆయ‌న సాధించిందేమిటి అనే ప్ర‌శ్న అంద‌రిలోనూ వినిపిస్తోంది! మాట‌ల యోగా లేక చేత‌ల యోగా అనేది ప‌రిశీలిస్తే..

ఆరు నెల‌లు.. ఒక వ్య‌క్తి ప‌రిపాల‌నను అంచ‌నా వేసేందుకు స‌రిపోయే స‌మయం! హ‌నీమూన్ పిరియడ్ అనుకున్నా.. ఈ స‌మ‌యంలో ఆయ‌న తీసుకునే నిర్ణ‌యాలే ప్ర‌జ‌ల‌పై చెర‌గ‌ని ముద్ర‌వేస్తాయి. ప్ర‌భుత్వ కార్యాలయాల్లో పాన్ - గుట్కాల ను నిషేధించడం - అమ్మాయిలను ఏడిపించే ఆకతాయిల ఆటపట్టించేందుకు యాంటీ రోమియో స్క్వాడ్‌ ల ఏర్పాటు - మంత్రులంతా తమ ఆస్తుల వివరాలను ప్రకటించాలని ఆదేశించడం - అధికారు ల బదిలీల్లో మంత్రులు జోక్యం చేసుకోవద్దని చెప్పడం, తాము ఏమేమీ అభివద్ధి కార్యక్రమాలు చేపట్టదల్చుకున్నారో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా చెప్పాలని సూచించడం.. ఇవ‌న్నీ ఆరు నెల‌ల్లో యోగి ఆదిత్యానాథ్ తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యాలు!!

దూకుడుగా నిర్ణ‌యాలు తీసుకోవ‌డం.. వాటిని అంతే దూకుడుగా అమ‌లు చేయ‌డం ఆయ‌న స్టైల్‌!! అయితే ఈ నిర్ణ‌యా లే ఆయ‌న కొంప‌ముంచాయి. రాష్ట్రంలోని లైసెన్స్‌ లేని కబేళాలను క్రమబద్ధీకరించడానికి బదులు మూసివేయడంతో మొదటికే మోసం వచ్చింది. ముస్లింలే కాకుండా దళితులు కూడా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఫలితంగా రాష్ట్ర ఖజానాకు 20 వేల కోట్ల రూపాయలకుపైగా ఆదాయం పడిపోయింది. కొత్త ఉద్యోగాలు రాకపోగా ఉన్న ఉద్యోగాలు ఇలా ఊడిపోవడం వల్ల దళిత యువత తీవ్ర అసంతప్తితో ఉంది. ఇక ఆదిత్యనాథ్‌ ఐదుసార్లు స్వయంగా ప్రాతినిథ్యం వహిం చిన గోరఖ్‌ పూర్‌ లోని బాబా రాఘవ దాస్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ఊపిరాడ‌క చిన్నారులు చ‌నిపోవ‌డం మాయ‌ని మ‌చ్చ‌!
Tags:    

Similar News