క‌రోనాపై వాట్స‌ప్ స్టేట‌స్ పెట్టాడు..జైలు పాల‌య్యాడు

Update: 2020-04-27 15:00 GMT
క‌రోనా వైర‌స్ వ్యాపిస్తున్న నేప‌థ్యంలో బాధితుల వివ‌రాలు గోప్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే క‌రోనా అనేది అంటువ్యాధి. మ‌హ‌మ్మారి కూడా. ఆ వైర‌స్ వ‌స్తే వారిని - వారి కుటుంబంపై వివ‌క్ష చూపే ప‌రిస్థితులు ఉన్నారు. వైర‌స్ బాధిత కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప‌రిస్థితులు ఉన్నాయి. ఇందులో భాగంగానే ఎక్క‌డా కూడా క‌రోనా సోకిన వ్య‌క్తులు - వారి కుటుంబ‌స‌భ్యుల వివ‌రాలు వెల్ల‌డించ‌డం లేదు. ప‌ల‌న ఊరు - ప‌ల‌న ప్రాంతం - వ‌య‌సు మిన‌హా ఇత‌ర వివ‌రాలేవి తెల‌ప‌డం లేదు. దీంతో క‌రోనా సోకిన కుటుంబం కోలుకున్నాక తిరిగి సాధార‌ణ జీవితం పొందుతున్నారు. ఈ విధంగా ప్ర‌భుత్వ యంత్రాంగం చ‌ర్య‌లు తీసుకుంటోంది. అయితే ఆ కుటుంబ వివ‌రాల‌ను బహిర్గ‌తం చేసిన వారిపై పోలీసులు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో క‌రోనా సోకిన యువ‌తి ఫొటోను త‌న వాట్స‌ప్ స్టేట‌స్ పెట్టుకున్న ఓ యువ‌కుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘ‌ట‌న క‌ర్నాట‌క రాష్ట్రంలో చోటుచేసుకుంది.

కర్ణాటకలోని విజయపుర జిల్లాకు చెందిన అనిల్ రాథోడ్ తన వాట్సప్ స్టేటస్‌ గా ఒక యువతి ఫొటో పెట్టుకున్నాడు. దాంతో పాటు బ్యాడ్ న్యూస్.. ఈ యువతికి కరోనా పాజిటివ్ వచ్చిందని రాశాడు. అత‌డి వాట్సప్ స్టేటస్ చూసిన కొందరు ఆ యువతికి తెలిపారు. ఈ క్ర‌మంలో ఆ స్టేట‌స్ చూసిన మరికొందరు జాలి ప‌డ‌డంతోపాటు ఆ అమ్మాయి ఎవ‌రు? ఎక్క‌డ ఉంటుంది? ఆమెకేమైనా సహాయం కావాలా అని అనిల్‌ను అడిగారు. కొంద‌రు ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు తెలిసిన వారు ఫొటో తీసేయ్‌.. అలా పెట్ట‌వ‌ద్దు అని హిత‌వు ప‌లికారు. ఆమెకు క‌రోనా సోకింద‌ని కొంద‌రికి మాత్రమే తెలిసింది. అత‌డి స్టేట‌స్‌ తో ఆ ప్రాంతంలో అంద‌రికీ తెలిసింది. దీంతో ఆ కుటుంబం ఇబ్బందుల‌కు గుర‌య్యింది. తీరా ఈ విష‌యం పోలీసులకు తెలిసింది. దీంతో అనిల్ రాథోడ్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

వాస్త‌వంగా కేంద్ర  ప్రభుత్వం ఆదేశాల ప్రకారం కరోనా రోగుల వివరాలను గోప్యంగా ఉంచాలి. వారి వివ‌రాల‌ను బ‌హిర్గ‌తం చేయ‌రాదు. ఆ నిబంధనల‌ను అతిక్రమించడంతో ఆ యువకుడు ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డాడు. భ‌విష్య‌త్‌ లో ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు. క‌రోనా బాధితుల వివ‌రాల‌ను గోప్యంగా ఉంచాల‌ని సూచించారు.


Tags:    

Similar News