ఏపీలో త్వరలో వైఎస్ ఆర్ అవార్డ్స్ ...ఎవరెవరికి

Update: 2019-10-31 09:00 GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి  పలు కీలక నిర్ణయాలతో ప్రజలని ఆశ్చర్యపరుస్తున్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ హామీలని ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ  పాలన కొనసాగిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో జగన్ చెప్పిన ప్రతి హామీని అమలులోకి తీసుకువస్తున్నారు. అలాగే ఎన్నికలలో ఇవ్వని హామీలని సైతం అమలు చేస్తున్నారు.

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుండి ఇప్పటివరకు ఎన్నో పథకాలని అమలులోకి తీసుకువచ్చారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల ఆరోగ్యం కోసం అలోచించి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకాన్ని ఒక్క ఏపీలో నే కాకుండా పక్క రాష్ట్రాలైన తెలంగాణ , కర్ణాటక , తమిళనాడు లోని కొన్ని  ప్రముఖ హాస్పిటల్స్ లో కూడా వర్తింపజేచేలా చర్యలు తీసుకున్నారు. అలాగే  గ్రామ వాలంటీర్ , గ్రామ సచ్చివాలయం ద్వారా సుమారుగా 4 లక్షల ఉద్యోగాలు కల్పించిన సీఎం ,..త్వరలో ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేస్తామని చెప్తున్నారు.  

ఇక తాజాగా సీఎం జగన్  మరో సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. పద్మశ్రీ తరహాలో ప్రతిభావంతులకు లైఫ్ అచీవ్ మెంట్ అవార్డులు ఇవ్వాలని  రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు పదిహేను, జనవరి ఇరవైఆరు తేదీలలో ఈ అవార్డులను ప్రకటించాలని ప్రతిపాదించినట్లు సమాచార శాఖ మంత్రి పేర్నినాని తెలియజేసారు. ఏపీ క్యాబినెట్  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సమావేశం అయి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వివిధ రంగాలలో ప్రతిభావంతులకు ఈ అవార్డులు ఇస్తారని ఆయన చెప్పారు. అవార్డుతో పాటు పది లక్షల రూపాయల
నగదు పారితోషికం కూడా ఇస్తారని తెలిపారు.
Tags:    

Similar News