మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావుపై.. వైసీపీ సీనియర్ నాయకుడు, విను కొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్తిపాటి పుల్లారావు.. మంత్రిగా ఉన్న సమయంలో ఆయన తనను రూ.20 కోట్లు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆరోపించారు.
అంతేకాదు..పార్టీ మారాలని కూడా ఒత్తిడి పెంచారని.. అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం బొల్లా మాట్లాడుతూ.. మాజీ మంత్రి పల్లారావుపై తీవ్ర విమర్శలు చేయడం సంచలనంగా మారింది.
బొల్లా ఏమన్నారో.. ఆయన మాటల్లోనే.. ''నేను రెండు దశాబ్ధాలుగా పారిశ్రామిక వేత్తగా ఉన్నా. ఒక పారిశ్రామిక వేత్తను ఏ ప్రభుత్వం వచ్చినా పారిశ్రామిక వేత్తగానే చూడాలి. కానీ, టీడీపీ హయాంలో అలా చూడలేదు. 2012లో గౌతమ బుద్ధ టెక్స్ టైల్స్ కు టెండర్ వేశాను. టెండర్ ప్రకారమే డబ్బులు కట్టాను . రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నా. అయితే.. గౌతమ బుద్ధ టెక్స్ టైల్స్ అనుమతికి అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అడ్డుపడ్డారు'' అని తెలిపారు.
అంతేకాదు.. పుల్లారావు తనను లంచం కూడా డిమాండ్ చేశారని అన్నారు. ''నన్ను 20 కోట్లు లంచం అడిగాడు. ఆ 20 కోట్లను పార్టీలో పైనుంచి కింద దాకా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. నన్ను రాజకీయ నాయకుడిగా కాకుండా పారిశ్రామికవేత్తగా చూస్తారనుకున్నా.
కానీ, ప్రత్తిపాటి పుల్లారావు అలా చేయలేదు. పార్టీ మారడంతో పాటు డబ్బు కట్టాలని ఒత్తిడి చేశారు. వాళ్ల ఒత్తిడికి తలొగ్గనందుకే అనుమతులు రద్దు చేశారు. నన్ను 20 కోట్లు అడిగారో లేదో మీరు ప్రమాణం చేస్తే...నేను ప్రమాణం చేయడానికి సిద్ధం'' అని బొల్లా సవాల్ రువ్వారు.
అదేసమయంలో..''గుంటూరు టెక్స్ టైల్స్ కు తనకు అసలు సంబంధమే లేదని ప్రత్తిపాటి పుల్లారావు చెబుతున్నారు. 2012 -19 వరకూ గుంటూరు టెక్స్ టైల్స్ కు ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ డైరెక్టర్ గా ఉన్నమాట వాస్తవం కాదా? నా ఆయిల్ ఇండస్ట్రీలో చిన్న ప్రమాదం జరిగిందని నన్ను అరెస్ట్ చేయించారు. నన్ను పెట్టిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు'' అని బొల్లా వ్యాఖ్యానించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.