నంద్యాలలో గెలుపు కోసం టీడీపీ అన్నీ ఇన్నీ పాట్లు పడటం లేదు. అంతేగాక ప్రతిపక్ష వైసీపీకి మద్దతుగా నిలుస్తున్న వారిపై బెదిరింపులకు పాల్పడుతోందన్న ఆరోపణలు తెలిసిందే! గెలుపు తమదే అని పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ.. మరి వెనుక ఇటువంటి చర్యలకు ఎందుకు పాల్పడుతోందన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పాలి. నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయం సాధించడం ఖాయమని - ఆ మేరకు మైండ్ లో ఫిక్స్ అయిపోయిందా? అందుకే దాడులు - దౌర్జన్యాలు - అరాచకాలకు పాల్పడుతోందా? అంటే అవుననే అంటున్నారు వైఎస్సార్ సీపీ నేత పార్థసారధి!!
నంద్యాల ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల వార్ పెరుగుతోంది. ఇక ప్రచారానికి కూడా సమయం దగ్గరపడుతున్న కొద్దీ.. టీడీపీ నేతల అరాచకాలు పెచ్చుమీరుతున్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో.. వైఎస్సార్ సీపీ నేత పార్థసారధి.. టీడీపీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికార టీడీపీ.. నంద్యాలలో ఓటమికి మానసికంగా సిద్ధమైందని అన్నారు. చంద్రబాబు తన కేబినెట్ లో ఒక్క ముస్లింకు కూడా స్థానం కల్పించలేదని గుర్తు చేశారు. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో మైనార్టీలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఓటమి భయంతోనే నంద్యాల ప్రజలను హింసిస్తున్నారని, గ్రామాల్లో వైఎస్సార్ సీపీ నేతలపై బైండోవర్ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఊరు వదిలి వెళ్లకపోతే రౌడీషీట్ తెరుస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. వైఎస్సార్ సీపీకి సహకరించిన దళితుడు బాలస్వామి ఇంటిపై పోలీసులతో దాడి చేయించారని, లెక్కలు చూసినా రూ. లక్ష నగదు తీసుకెళ్లారని తెలిపారు. జగన్‌కు ఓటేస్తానని ఓ అవ్వ చెప్పడంతో పెన్షన్ కట్ చేస్తామని టీడీపీ కార్యకర్తలు బెదిరిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు ఈవిధంగా ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు నిర్ణయాలపై టీడీపీ అభ్యర్థులే కినుక వహిస్తున్నారని తెలిపారు. తన రాజకీయ అవసరాల కోసం ఎవరినైనా అణగతొక్కడం చంద్రబాబు నైజమన్నారు.