రాజకీయ పార్టీలతో అనుబంధం ఆనందం ఒక లెవెల్ వరకే ఉంటాయి. తాము అందుకున్న హోదా పదవి ఉత్సవ విగ్రహం అయినపుడు ఎలాంటి నాయకుడికి అయినా నిగ్రహం నశిస్తుంది. అదే టైమ్ లో తానున్న పార్టీ పరిధి దాటి మరీ ఆవేశం పెల్లుబుకుకుంది. ఇదే ఇపుడు వైసీపీ సర్పంచుల విషయంలో జరుగుతుంది అని అంటున్నారు. సరిగ్గా ఏణ్ణర్ధం క్రిత్రం వారు అతి ఉత్సాహంతో గ్రామాల ఎన్నికల్లో పాల్గొన్నారు. తమ పార్టీ వారితో పోటీ పడి టికెట్లు తెచ్చుకున్నారు.
ఆనక ప్రత్యర్ధి పార్టీలను ఎన్నికల రణ క్షేత్రంలో ఎదిరించి గెలిచారు. దాని కోసం ఈ రాజకీయ జూదం కోసం డబ్బుని బాగానే ఖర్చు చేసి ఉంటారు. ఇలా డైరెక్ట్ గా ఎన్నికల్లో గెలిచిన వారు ఒక ఎత్తు అయితే అసలు ఎన్నికలే లేకుండా ఏకగ్రీవం చేసుకున్న వారు మరో ఎత్తు. ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు ఇరవై లక్షల రూపాయలు ఇస్తుంది అని చెప్పడంతో చాలా గ్రామాలలో వేలం పాటలే నడిచాయి. ఏకగ్రీవం పేరుతో తెర వెనక భారీగా ఖర్చు చేసి పోటీదారులను లేకుండా చేసుకుని మొత్తానికి నెగ్గిన వారి స్థితి కూడా ఇపుడు దయనీయంగా ఉంది.
ఎందుచేత అంటే ఈజీగా పద్దెనిమిది నెలలు గడచిపోయాయి. అయినా సరే సర్పంచు గా కనీసం వీధి దీపాలు అయినా వేయించలేకపోయారు. అంతే కాదు కాలువలు బాగు చేయించలేకపోయారు. తమ వీధులను చక్కగా చేసుకోలేకపోయారు. చేతిలో పైసా లేదు, ఎందుకొచ్చిన ఈ పంచాయతీ బోర్డు సర్పంచ్ పదవి అంటూ అధికార పార్టీకి చెందిన వైసీపీ ఎమ్మెల్యేలే ఆవేదన చెందుతున్నారు అంటే ఆలోచించాల్సిందే కదా.
పంచాయతీలకు కేంద్రం నుంచి నిధులు వస్తాయి. అయితే వాటిని మధ్యలోనే రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుంటూ తమకు పైసా కూడా ఇవ్వలేదని అధికార పార్టీ సర్పంచులే ఇపుడు గోడు పెడుతున్నారు. కేంద్రం ఇచ్చే నిధూను కరెంట్ బిల్లుల పేరుతో రాష్ట్రం తన ఖాతాలో వేసుకుంటోందని చెబుతున్నారు.
ఇక మరో వైపు చూస్తే ఏకగ్రీవ పంచాయతీలకు ఇరవై లక్షల రూపాయలు అన్నారు. ఒక్క పైసా కూడా ఈ రోజుకి కూడా విదిలించినది లేదు అని సర్పంచులు అంటూంటే సీరియస్ మ్యాటరే కదా ఇది అనుకోవాల్సిందే మరి. ఇక పంచాయతీలలో అభివృద్ధి పనులు చాలా జోరుగా వైసీపీ నేతలు చేసేశారు. అదంతా అతి ఉత్సహం, మన సర్కారే కదా అని అతి ధీమా. అయితే అలా పనులు చేసి బిల్లులను రెడీ చేసి పెట్టుకున్నా ఆ రూపేణా పైసా కూడా రాలకపోవడంతో వారంతా కూడా దిగాలు పడుతున్నారు.
ఇపుడు వారికి సర్దిచెప్పడం కూడా సర్పంచులకు మరో బరువైన బాధ్యతగా అయిపోయింది అని అంటున్నారు. ఇలా అన్ని రకాలుగా తాము నిండా మునిగిపోయామని వైసీపీ సర్పంచులతో సహా అంతా తెల్సుకునేసరికి పుణ్యకాలం పద్దెనిమిది నెలలు గడచిపోయాయి. ఒక వైపు జనాలు పనులు చేయలేదని నిందిస్తున్నారు. మరో వైపు బిల్లులు రాలేదని సొంత పార్టీలో ఉన్న కాంట్రాక్టర్లు గుస్సా అవుతున్నారు. ఇంకో వైపు కుర్చీ తప్ప పైసా రాలని ఈ పదవి ఏల అంటూ అనుచరులే రివర్స్ అవుతున్నారు.
దీంతో వైసీపీ సర్పంచులు కీలకమైన నిర్ణయమే తీసుకుంటున్నారుట. వారు రోడ్ల మీదకు వచ్చి తమ ప్రభుత్వం మీద తమ అధినాయకుడు జగన్ మెదనే పోరాటం చేయడానికి రెడీ అవుతున్నారని చెబుతున్నారు. అంటే వారి బాగా విసిగిపోయి ఉండే ఈ డెసిషన్ కి వచ్చారని అంటున్నారు. సరే వైసీపీ సర్పంచులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేసినా నిరసనలు చేసినా ఏమి జరుగుతుంది అన్నదే ఇక్కడ ప్రశ్న. ప్రభుత్వం తమ వారు అయినా పరవారు అయినా పైసా విదిలించే స్థితిలో ఉందా అంటే అక్కడ ఖజానా ఖాళీ అయింది అని అంటున్నారు.
దాంతో వైసీపీ సర్పంచులు వేదన అరణ్య రోదన అవుతుందా అంటే అదే నిజమని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దైనందిన వ్యవహారాలకే అప్పులు పుట్టక సాఫీగా సాగని వేళ సర్పంచులు పోలోమంటూ రోడ్ల మీదకు వస్తే దండీగా నిధులు ఎలా కుమ్మరిస్తారు. జగన్ కూడా ఏమీ చేయలేరని అంటున్నారు. కాకపోతే సొంత పార్టీ సర్పంచులే రోడ్లు ఎక్కితే అది రాజకీయంగా వైసీపీకి ఇబ్బందులు తెచ్చిపెడుతుంది అని అంటున్నారు. దీని సాకుగా తీసుకుని విపక్షాలు బదనాం చేసేందుకు కూడా వీలు అవుతుందని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.