ట్రంప్ తో ధోనీ... గోల్ఫ్ కోర్టులో పిక్స్ వైరల్!

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కలిశారు

Update: 2023-09-08 04:55 GMT

ఒక అరుదైన సంఘటన తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో జరిగింది. టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కలిశారు.. కాసేపు గోల్ఫ్ ఆడారు.. అనంతరం కాసేపు భేటీ అయ్యారు.. దీనికి సంబంధించిన ఫోటోలూ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

అవును... భారత మాజీ కెప్టెన్ ధోనీ ప్రస్తుతం యూఎస్ లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రాస్తుతం క్రికెట్‌ కు దూరంగా తన సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2023 ముగిసినప్పటి నుండి.. ధోని రాంచీ వీధుల్లో లేదా విమానాల్లో తరచుగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్రికెట్ కు దూరంగా ఇతర వ్యాపకాలకు దగ్గరగా గడుపుతున్నట్లు కనిపిస్తున్నాడు.

ఈ క్రమంలోనే యూఎస్ ఓపెన్ టెన్నీస్ మ్యాచ్ చూసేందుకు అమెరికా వెళ్లాడు ధోని. ఈ సమయంలో ఆయనకు అరుదైన ఆహ్వానం దక్కింది. ఇందులో భాగంగా ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ధోనీని గోల్ఫ్ ఆటకోసం ఆహ్వానించారు. దీంతో ట్రంప్ ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లిన ధోనీ... గోల్ఫ్ ఆడిన అనంతరం ట్రంప్ తో కాసేపు భేటీ అయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

దీనికి సంబంధించిన ఫోటోలు తన ఇన్ స్టా గ్రాం లో హితేష్ సంఘ్వీ... "మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు మిస్టర్ ప్రెసిడెంట్‌ కి ధన్యవాదాలు 🙏🙏🙏" అని పోస్ట్ చేశారు.

హితేష్ సంఘ్వీ దుబాయ్‌ లో ఉన్న ఒక వ్యాపారవేత్తే కాకుండా... భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోనీకి సన్నిహితుడిగా కూడా పరిగణించబడ్డాడు. ఈ క్రమంలో ధోనీ, సంఘ్వీ వారి స్నేహితులతో కలిసి యూఎస్ ఓపెన్ కోసం అమెరికా వెళ్లగా.. ఈ అనుకోని ఆహ్వానం అందిందని తెలుస్తుంది.

Tags:    

Similar News