సచిన్, ద్రావిడ్ పేర్లతో సంబంధంపై రచిన్‌ తండ్రి క్లారిటీ ఇదే!

అయితే అతని పేరు వెనుక ఉన్న అసలు స్టోరీని రచిన్ తండ్రి రవి కృష్ణమూర్తి తాజాగా వివరించారు.

Update: 2023-11-14 11:41 GMT

న్యూజిలాండ్ కొత్త సంచలనం రచిన్ రవీంద్ర ఈ వరల్డ్ కప్ లో దుమ్ములేపుతున్న సంగతి తెలిసిందే. బుధవారం భారత్ తో సెమీఫైనల్ లో తలపడనున్న కివీస్ జట్టులో రచిన్ కూడా కీలక ప్లేయర్. ఈ సమయంలో అతని పేరుపై మరోసారి చర్చ మొదలైంది. ఈ సందర్భంగా అతని తండ్రి రవి కృష్ణమూర్తి క్లారిటీ ఇచ్చాడు. రచిన్ కు ఆ పేరు ఎలా పెట్టింది వివరించారు.

అవును.. న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర పేరు చూసి ఇన్నాళ్లూ రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్ ల పేర్లను మిక్స్ చేసి పెట్టారని అంతా అనుకున్నారు. అయితే అతని పేరు వెనుక ఉన్న అసలు స్టోరీని రచిన్ తండ్రి రవి కృష్ణమూర్తి తాజాగా వివరించారు. ఇందులో భాగంగా... రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండుల్కర్ ల పేర్లతో రచిన్ కు సంబంధమే లేదని చెప్పుకొచ్చారు.

ఈ విషయంపై స్పందించిన కృష్ణమూర్తి... తాము కూడా కొన్నేళ్ల తర్వాతే రచిన్ పేరు ఇలా రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ పేర్ల కలయిక అని గుర్తించినట్లు తెలిపారు. తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... రచిన్ అనే పేరును మొదట తన భార్య సూచించిందని రవి కృష్ణమూర్తి చెప్పారు.

"రచిన్ పుట్టినప్పుడు నా భార్య ఆ పేరు సూచించింది. దానిపై మేము పెద్దగా చర్చించుకోలేదు. పేరు బాగుందని అదే పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాం. కొన్నేళ్ల తర్వాతే మాకు అది రాహుల్, సచిన్ ల కలయిక అని తెలిసింది. అయితే మా కొడుకును ఓ క్రికెటర్ గా చేయాలన్న ఉద్దేశంతో మాత్రం ఆ పేరు పెట్టలేదు" అని రవి కృష్ణమూర్తి క్లారిటీ ఇచ్చారు.

కాగా... బెంగళూరుకు చెందిన రవి కృష్ణమూర్తి.. తర్వాత న్యూజిలాండ్ వెళ్లి సెటిలయ్యారు. అక్కడే పుట్టిపెరిగిన రచిన్.. తర్వాత నేషనల్ క్రికెట్ టీం కు ఆడే స్థాయికి చేరాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో రచిన్ 9 మ్యాచ్ లలో ఏకంగా 565 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు ఉండగా.. రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

ఈ వరల్డ్ కప్ లో 594 పరుగులతో విరాట్ కొహ్లీ, 591 పరుగులతో డీకాక్ లు మొదటి రెండు స్థానాల్లోనూ ఉండగా.. వారి తర్వాత 70.62 యావరేజ్ తో రచిన్ రవీంద్ర మూడో ప్లేస్ లో ఉన్నాడు. ఇక బుధవారం భారత్ తో జరిగే మ్యాచ్ లో ఏ మేరకు రానిస్తాడనేది వేచి చూడాలి!

Tags:    

Similar News