వినేశ్ సిల్వర్ మెడల్ అభ్యర్థనపై 'కాస్' అధికారిక ప్రకటన!

అవును... ఒలింపిక్స్ రెజ్లింగ్ లో తనపై అనర్హతను సవాల్ చేస్తూ వినేశ్ ఫోగాట్ చేసిన అభ్యర్థనపై ‘కాస్’ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Update: 2024-08-09 11:55 GMT

ఒలింపిక్స్ రెజ్లింగ్ లో తనపై అనర్హతను సవాల్ చేస్తూ, తనకూ సంయుక్తంగా రజత పతకం ఇవ్వాలంటూ వినేశ్ ఫోగాట్ చేసిన అభ్యర్థనపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్) స్పందించింది. ఈ సందర్భంగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఒలింపిక్స్ క్రీడలు ముగిసే లోగా ఆర్బిట్రేషన్ దీనిపై తుది నిర్ణయం వెలువరించే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది.

అవును... ఒలింపిక్స్ రెజ్లింగ్ లో తనపై అనర్హతను సవాల్ చేస్తూ వినేశ్ ఫోగాట్ చేసిన అభ్యర్థనపై ‘కాస్’ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అనర్హతపై వినేశ్ ఆగస్టు 7న ‘కాస్’ అడహాక్ డివిజన్ లో దరఖాస్తు చేసుకుందని.. ఫైనల్ మ్యాచ్ కు ముందే దీనిపై ఆదేశాలివ్వాలని కోరిందని.. ఫైనల్ లో పోటీ చేసేందుకు తనను అర్హురాలిగా ప్రకటించాలని అభ్యర్థించిందని తెలిపింది.

అయితే... దీనిపై ఆమె ఎలాంటి అత్యవసర మధ్యంతర ఉపశమనాలు కోరలేదని వెల్లడించింది. ఏది ఏమైనా.. ఆమె అనర్హత, సిల్వర్ మెడల్ పై ఆమె చేసిన అభ్యర్థను సోలో ఆర్బిట్రేటర్ కు బదిలీ చేసినట్లు తెలిపింది. దీనిపై శుక్రవారం వాదనలు జరగనున్నాయని.. ఒలింపిక్స్ క్రీడలు ముగిసే లోగా నిర్ణయం వెలువరించే అవకాశం ఉందని ‘కాస్’ తన ప్రకటనలో వెల్లడించింది.

అయితే ఈ అభ్యర్థనపై పారిస్ కాలమానం ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ‘కాస్’ దీన్ని విచారించనున్నట్లు తెలిపింది. ఈ సమయంలో వినేశ్ తరుపున వాదించేందుకు ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వేతో పాటు విదుష్పత్ సింఘానియాను భారత ఒలింపిక్ సంఘం నియమించింది. వీరితోపాటు ఫ్రెంచ్ లాయర్స్ టీం కూడా వినేశ్ తరుపున వాదనలు వినిపించనుందని తెలుస్తోంది.

ఈ సమయంలో... ఒకవేళ ఆర్బిట్రేషన్ అనుమతిస్తే వినేశ్ కు రజత పతకం దక్కే అవకాశం లేకపోలేదని అంటున్నారు. దీంతో... ‘కాస్’ ఇవ్వబోయే తీర్పుపై భారత అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అనర్హత విషయానికొస్తే... ఆమె ఇప్పటికే రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే!

Tags:    

Similar News