ఐశ్వర్య ఎప్పుడైన ఫోన్ చేసి మాట్లాడాలి అంటే నాలో కంగారు!
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ సినిమాలతోనే కాకుండా వ్యక్తిగత విషయాలతోనూ ఎప్పుడూ వార్తల్లో ఉంటారు.;
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ సినిమాలతోనే కాకుండా వ్యక్తిగత విషయాలతోనూ ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఆ మధ్య ఐశ్వర్య రాయ్‌తో అభిషేక్ బచ్చన్ దూరంగా ఉంటున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఆ మధ్య ఒక సెలబ్రిటీ పెళ్లికి వీరిద్దరు హాజరు అయ్యారు కానీ వేరు వేరుగా హాజరు కావడంతో రకరకాలుగా పుకార్లు షికార్లు చేశాయి. అంతే కాకుండా ఐశ్వర్య రాయ్ తన కూతురుతో కలిసి ఒంటరిగా, బచ్చన్ ఫ్యామిలీకి దూరంగా నివాసం ఉంటుంది అనే వార్తలు సైతం బాలీవుడ్ మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. ఆ సమయంలోనూ అభిషేక్ బచ్చన్ స్పందించాలి అంటూ మీడియాలో కొందరు డిమాండ్ చేస్తూ వచ్చారు. మొత్తానికి ఏదో ఒక రకంగా అభిషేక్ బచ్చన్ వార్తల్లో ఉంటాడు.
ఒకప్పుడు దేశంలోనే గొప్ప అందాల తార ఎవరు అంటే మరో ఆలోచన లేకుండా యూత్ మొత్తం ఐశ్వర్య రాయ్ పేరు చెప్పేవారు. ఆమె అందంతో పాటు నటనతో దేశాన్ని మొత్తం ఫిదా చేసింది. అందుకే ఐశ్వర్య రాయ్ అంటే అంత స్పెషల్, అలాగే ఆమెను పెళ్లి చేసుకున్న అభిషేక్ బచ్చన్ అంటే అంత స్పెషల్. అభిషేక్ బచ్చన్ ఎంతో అదృష్టం చేసుకోవడం వల్లే ఐశ్వర్య రాయ్ వంటి అందగత్తెను పెళ్లి చేసుకునే అవకాశం దక్కించుకున్నాడు అంటూ అప్పట్లో మాట్లాడుకుంటూ ఉండేవారు. ఆ విషయం పక్కన పెడితే పెళ్లి అయినప్పటి నుంచి వీరి వైవాహిక బంధం గురించి, ప్రేమ విషయం గురించి ఏవో పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. జయా బజ్చన్‌తో ఐశ్వర్య రాయ్‌కి పొసగడం లేదు అనేది చాలా కాలం నుండి వస్తున్న పుకారు. ఇన్ని పుకార్లు వచ్చినా తాము ఇద్దరం కలిసే ఉన్నామని ఎప్పటికప్పుడు అభిషేక్ చెబుతూ వస్తున్నాడు.
తాజాగా ఒక అవార్డ్ వేడుకలో అభిషేక్ బచ్చన్ పాల్గొన్నాడు. ఆ అవార్డ్ వేడుక హోస్టింగ్ చేస్తున్న యంగ్ హీరో అర్జున్ కపూర్ మాట్లాడుతూ అభిషేక్ బచ్చన్‌ను సరదాగా ఒక ప్రశ్న అడిగాడు. నేను మీతో మాట్లాడాలి అని ఎవరు మీతో ఫోన్‌లో అంటే మీకు కంగారు వస్తుందని అడిగాడు. అందుకు అభిషేక్ బచ్చన్ నవ్వుతూ.. నా భార్య ఐశ్వర్య ఎప్పుడైన ఫోన్ చేసి మాట్లాడాలి అంటే నాలో కంగారు మొదలవుతుంది. ఆ సమయంలో గందరగోళానికి గురి అవుతాను. ఏం ఆలోచించలేక పోతాను, ఏం చేయాలో అర్థం కాదు అన్నట్టు చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో అభిషేక్ బచ్చన్ మాత్రమే కాకుండా మగాళ్లలో ఎక్కువ శాతం మంది భార్యలు ఫోన్ చేసి మీతో మాట్లాడాలి అని సీరియస్‌గా అంటే కచ్చితంగా కంగారు పడే వారు ఉంటారు.
చాలా మంది ఈ విషయాన్ని చెప్పుకోరు... కానీ అభిషేక్ బచ్చన్ మాత్రం మనసులో ఉన్నది చెప్పేశాడు. ఈ విషయం చెప్పడం ద్వారా తాను స్పెషల్ భర్తను కానని, భార్య ముందు తాను ఒక సాధారణ భర్తనే అని అభిషేక్ బచ్చన్ చెప్పకనే చెప్పాడు. గతంలోనూ పలు సార్లు ఐశ్వర్య రాయ్‌కి తాను గౌరవం ఇస్తాను, భయపడతాను, ఆమె పని పట్ల అభిమానం కనబర్చుతాను అంటూ అభిషేక్ బచ్చన్ చెప్పుకొచ్చాడు. పెళ్లి అయ్యి దాదాపు 20 ఏళ్లు కావస్తున్నా ఇద్దరి మధ్య అన్యోన్యం చూస్తూ ఉంటే ముచ్చటేస్తుందంటూ కొందరు కామెంట్ చేస్తూ ఉంటారు. వీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని అభిమానులు కోరుకుంటూ ఉంటారు. తాజాగా జూనియర్ బచ్చన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా గత కొన్ని రోజులుగా వస్తున్న విడాకుల పుకార్లకు బచ్చన్ వ్యాఖ్యలు ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయింది.