ఓల్డ్ సిటీలో క‌బాబ్ లు కుమ్మేస్తుందిట‌!

సెల‌బ్రిటీ వ‌ర‌ల్డ్ లోకి అడుగు పెడితే నోరు క‌ట్టేకోవాల్సిందే. హీరోయిన్ లుక్ మెయింటెన్ చేయాలంటే? తినుబండారాల‌కు దూరంగా..ఫిట్ నెస్ కి చాలా ద‌గ్గ‌ర‌గా ఉండాలి.

Update: 2023-10-01 10:30 GMT

సెల‌బ్రిటీ వ‌ర‌ల్డ్ లోకి అడుగు పెడితే నోరు క‌ట్టేకోవాల్సిందే. హీరోయిన్ లుక్ మెయింటెన్ చేయాలంటే? తినుబండారాల‌కు దూరంగా..ఫిట్ నెస్ కి చాలా ద‌గ్గ‌ర‌గా ఉండాలి. నిత్యం యోగా..జిమ్ అంటూ ఆక‌ర్షించే స్కిన్ టోన్ మెయింటెన్ చేయాలి. అందుకు త‌ప్ప‌నిస‌రిగా డైట్ ఫాలో అవ్వాల్సిందే. న్యూట్రీష న్లు ..డైటీషియ‌న్లు ఏది సూచిస్తే అదే తినాలి. ఆ ర‌కంగా ప‌రిమితంగానే ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ విష‌యంలో పుడీలు ఎంత ఫీల్ అవుతారో చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌భాస్..ఎన్టీఆర్ లే అందుకు మంచి ఉదాహ‌ర‌ణ‌. ఇద్దరు మంచి పుడ్ ప్రియులు. కానీ హీరోల‌య్యారు కాబ‌ట్టి ఇష్ట‌మైన వంట‌కాల‌కు దూరంగా ఉండాల్సి వ‌స్తోంది. ఈ జాబితాలో చాలా మంది హీరోయిన్లు కూడా ఉన్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ స‌యి మంజ్రేక‌ర్ కూడా ఆ కోవ‌కు చెందిన న‌టే. `మేజ‌ర్`..`గ‌ని` లాంటి చిత్రాల్లో న‌టించిన అమ్మ‌డు తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మే.

మ‌హేష్ మంజ్రేక‌ర్-మేధా మంజ్రేక‌ర్ వార‌సురాలిగా తెరంగేట్రం చేసిన అమ్మ‌డు ఇటీవ‌ల రిలీజ్ అయిన `స్కంద‌`లోనూ న‌టించిన సంగ‌తి తెలిసిందే. అటు బాలీవుడ్ సినిమాల‌తోనూ బిజీగా ఉంది. ఈ బ్యూటీ కూడా మంచి పుడీ. ఫాస్ట్ పుడ్ చూస్తే తిన‌కుండా ఉండ‌లేదుట‌. నోరు క‌ట్టుకోవ‌డం చాలా క‌ష్ట‌మంటోంది. మోద‌క్..గులాబ్ జామున్...ర‌స‌గుల్లా లాంటివి చూస్తే నోరు ఊరుకోదుట‌. డైటింగ్ వ‌ల్ల ఇప్పుడు నోరు క‌ట్టేసుకుందిట‌. అయితే పండ‌గ‌లు.. పుట్టిన రోజులు వ‌స్తే మాత్రం ఒట్టు తీసి గ‌ట్టున పెడుతుందిట‌.

పుల్లుగా త‌న‌కు ఇష్ట‌మైన‌వి అన్నీ క‌డుపునిండా లాగించేస్తుందిట‌. ఇక హైద‌రాబాద్ ఎప్పుడూ వ‌చ్చిన ప‌ప్పు ట‌మోటో..గోంగూర ప‌చ్చ‌డి అస్స‌లు మిస్ అవుదుట‌. ఇక నాన్ వెజ్ లో కాబాబ్ లు చూస్తే క్ష‌మించింద‌ట‌. ప్ర‌త్యేకంగా ఓల్డ్ సిటీ వెళ్లి మ‌రీ తింటుందిట‌. అక్క‌డ ఎన్ని ర‌కాల కబాబ్ లు అందుబా టులో ఉంటే అన్నింటిని లాగించేస్తుందిట‌. ఇండియాలోనే క‌బాబ్ ల‌కు ఆ ప్లేస్ చాలా స్పెష‌ల్ అంటోంది. అక్క‌డున్నంత టేస్ట్ ఇంకెక్క‌డా రాదు. అక్క‌డికి వెళ్ల‌డం కూడా పెద్ద ఇబ్బంది కాదు అంటోంది.

Tags:    

Similar News