మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆచార్య రిలీజ్ కి రెడీగా ఉంది. కానీ తేదీపై సందిగ్ధత నెలకొంది. చాలా కాలంగా వాయిదా పడిన ఆచార్య సంక్రాంతి 2022 సీజన్ లో విడుదలవుతుందని ఇప్పటికే కథనాలొచ్చినా దీనిపై అధికారికంగా క్లారిటీ లేదు. ఆచార్య ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. పెండింగ్ పాటల చిత్రీకరణ పూర్తవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ సైమల్టేనియస్ గా జరుగుతోంది.
సంక్రాంతికి ముందు రిలీజ్ తేదీని ఆచార్య బృందం పరిశీలిస్తోంది. ఈ చిత్రాన్ని జనవరి మొదటి వారంలో విడుదల చేయడానికి ఆచార్య నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని తాజాగా గుసగుసలు వినిపిస్తున్నాయి. జనవరి 7 అలాగే జనవరి 8 తేదీలు ఆచార్యకు అనుకూలం అని భావిస్తున్నారట. అయితే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో విడుదలైనా ఆశ్చర్యపోనవసరం లేదని ఒక సెక్షన్ లో గుసగుస వినిపిస్తోంది. తేదీ ఫిక్సయ్యాక తదనుగుణంగా అధికారిక ప్రకటన చేయనున్నారని సమాచారం. మరోవైపు చిరు మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ రీమేక్ తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత బాబి - మెహర్ రమేష్ లతో సినిమాలు చేస్తారు.
యువహీరోలకు చిరు స్ఫూర్తి:
మెగాస్టార్ చిరంజీవి 60 ప్లస్ ఏజ్ లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వయసు ఒక నంబర్ మాత్రమేనని ఆయన నిరూపిస్తూ యువహీరోలకే సవాల్ విసురుతున్నారు. ఆచార్యను రిలీజ్ కి రెడీ చేస్తున్న చిరు.. మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్ `గాడ్ ఫాదర్` లో నటిస్తున్నారు. దీంతో పాటు మెగాస్టార్ మరో రెండు చిత్రాల్లో నటిస్తారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న వేదాళం రీమేక్ టైటిల్ గా `భోళా శంకర్`ని ప్రకటించారు. భోళా శంకర్ టైటిల్ కి తగ్గట్టే మెగాస్టార్ నుంచి గొప్ప వినోదాన్ని అందించనున్నారు.అలాగే మెహర్ కంటే ముందే బాబీతో సినిమా చిత్రీకరణకు వెళ్లాల్సి ఉంటుందిట. కానీ దర్శకుడు బాబి తెరకెక్కించే సినిమాకి టైటిల్ ని అధికారికంగా ప్రకటించలేదు. మెగా బాస్ ని పూర్తి మాస్ రోల్ లో చూపించేందుకు బాబి సిద్ధమవుతున్నారు.
చిరు బర్త్ డే రోజున పోస్టర్ ని లాంచ్ చేయగా చక్కని స్పందన వచ్చింది. దీనికి వాల్తేరు వీరన్న లేదా వాల్తేరు శీను అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారని కథనాలొచ్చాయి. వైజాగ్ లోని మత్స్యకారుల నేపథ్యంలో మాస్ స్టోరీని బాబి ఎంపిక చేసుకున్నారని ఊహాగానాలు సాగిస్తున్నారు. వాల్తేర్ కి చెందిన వీరన్న కథను బాబి రాసారు. అయితే ఇప్పుడు వీరన్న టైటిల్ మారుతుందని ఊహాగానాలు సాగుతున్నాయి. వాల్తేర్ వీరన్న కాస్తా వాల్తేర్ శీనుగా మార్చారని కథనొలొచ్చాయి. గాడ్ ఫాదర్ చిత్రీకరణ పూర్తి కాగానే బాబీతో సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మాస్ ఎంటర్ టైనర్ ని నిర్మిస్తుంది. వరుసగా మూడు సినిమాలు పూర్తయ్యాక మారుతికి ఛాన్సుంటుందని భావిస్తున్నారు.
పరిశ్రమ సమస్యల పరిష్కారంలో చొరవ
కెరీర్ లో ఎంత బిజీగా ఉన్నా సినీపెద్దగా మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. కరోనాలో సీసీసీ పేరుతో సేవలందించిన చిరు యువహీరోల సినిమాలను ఇటీవల ప్రమోట్చ చేస్తున్నారు. మరోవైపు ఏపీలో టిక్కెట్టు ధరల సవరణ జీవో విషయంలో ప్రభుత్వానికి నివేదిస్తూ నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. పరిశ్రమ తరపున ఆయన సీఎం జగన్ ని సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరుతున్నారు.