ఆడ పిల్ల పుడితే తప్పేంటి? పైగా నల్లగా పుడితే నేరమా? అసలు ఆడపిల్ల జీవితంలో కష్టంనష్టం గురించి ఆలోచించే మానవత్వం నీలో లేదా? 21వ శాతబ్ధంలో ఉన్నాం.. ప్రపంచం ఇంత ముందుకు వెళ్లినా, గతం ఒక పీడకలలానే వెంటాడుతోంది. ఇప్పటికీ ఆడపిల్ల పుడుతోంది అంటే గొంతు నులిమే లోకం మనది. ఓవైపు అమ్మాయిల శాతం అబ్బాయిల శాతంతో పోలిస్తే గణనీయంగా తగ్గిపోయిందని సర్వేలు చెబుతున్నాయి. పెళ్లికి పిల్ల దొరక్క నానా తంటాలు పడుతున్నారు బ్రహ్మచారులు. అయితే ఇలాంటి సన్నివేశంలో అమ్మాయిలపై పెరుగుతున్న ఆకృత్యాల్ని స్పర్శిస్తూ, ఒక పల్లె వాతావరణంలో జరిగిన కథను ఎంచుకుని ఫ్లాష్ బ్యాక్స్ బ్యాక్ డ్రాప్ తో తీసిన సినిమా ఐరా. ఈ సంగతిని తాజాగా రిలీజ్ చేసిన ఐరా టీజర్ చెప్పకనే చెబుతోంది.
ఈ చిత్రంలో తలైవి నయనతార ద్విపాత్రాభినయం చేయడం మరో హైలైట్. ఐరా టీజర్ ఆద్యంతం ఎంతో గ్రిప్పింగ్ గా కనిపిస్తోంది. ట్రైలర్ లో సస్పెన్స్, థ్రిల్ మైమరిపిస్తోంది. ఇక నల్లమ్మాయ్, తెల్లమ్మాయ్ గా నయన్ ఇస్తున్న ట్విస్టులు మామూలుగా లేవు. రెండు కాలాల్లో కథ సాగుతోంది. ఇక ఆ పల్లె పట్టు పడతి జీవితంలో ఆరుగురు ఎవరు? అన్నది సస్పెన్స్ గా ఉంచారు. ``నాకే తెలియని ఎవరో ఆరుగురు నా తలరాతను తలకిందులుగా రాశారు..!``, ``అందరికీ సంతోషంగా బతకడం ఓ కల. కానీ జీవితంలో సంతోషం అంటే ఏంటో తెలియని నాకు బతకడమే ఓ కల!!`` అంటూ ఆడపిల్ల కష్టాన్ని నయన్ గొంతులో వినిపించారు. శత్రువులపై ప్రతీకారం, సస్పెన్స్ ఎలిమెంట్ ఆకట్టుకుంటోంది.
మళ్లీ ఆడపిల్ల పుట్టిందిరా! .. అయ్యో ఆడపిల్లా?! అంటూ ఆరంభమే కథలో ట్విస్టేంటో చెప్పేశారు. మొత్తానికి నయన్ మరోసారి అవార్డ్ బ్రేకింగ్ పెర్ఫామెన్స్ ఇవ్వబోతోందని ఐరా టీజర్ చెబుతోంది. ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకంపై ఆర్. రవీంద్రన్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. లఘుచిత్రాల దర్శకుడు సార్జున్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ కానుంది.
Full View