మక్కాలో ఆలీ.. ఎలా ఉన్నాడో చూడండి

Update: 2017-12-24 06:16 GMT
కొందరు వ్యక్తుల్ని చూస్తే వాళ్ల కులం.. మతం.. ఇలాంటి విషయాలేవీ మనకు గుర్తుండవు. ఆ వ్యక్తులు విశ్వమానవుల్లా బతికేస్తుంటారు. అందరితోనూ కలిసిపోతుంటారు. ఏదైనా ప్రత్యేక సందర్భం వస్తే తప్ప ఆ విషయాలు తలపుల్లోకే రావు. కమెడియన్ ఆలీ ఆ కోవలోకే వస్తాడు. ఆలీ అనేది ముస్లిం పేరు అనే విషయం కూడా జనాలకు గుర్తుండదు. రంజాన్ పండగో.. ఇంకేదైనా సంరద్భం వస్తేనే ఈ విషయం గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఆలీ మక్కాకు వెళ్లడం ద్వారా ఆ విషయాన్ని గుర్తు చేశాడు. ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలనుకునే పవిత్ర స్థలం మక్కా.

ఇటీవలే ఆలీ తన కుటుంబంతో కలిసి అక్కడికి వెళ్లాడు. సంప్రదాయ దుస్తుల్లో మక్కాను సందర్శించి.. అక్కడే తన కొడుకుతో కలిసి ఫొటో దిగాడు. సోషల్ మీడియాలోకి వచ్చిన ఆ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో ఆలీ అవతారం అందరికీ కొత్తగా అనిపిస్తోంది. ఎప్పుడూ నవ్వులతో ముంచెత్తే ఆలీ ఇలా సీరియస్ అవతారంలో కనిపించడం అరుదే. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’తో పాటు పవన్ కళ్యాణ్ చిత్రం ‘కాటమరాయుడు’.. ఇంకా మరికొన్ని సినిమాల్లో నటించాడు ఆలీ. ఐతే ఈ స్టార్ కమెడియన్ ఒకప్పటి స్థాయిలో బిజీగా లేడిప్పుడు. బ్రహ్మానందం లాగే ఆలీకి కూడా ఈ మధ్య అవకాశాలు బాగా తగ్గిపోయాయి.
Tags:    

Similar News