చూపిస్తాడా త‌డాఖా.. అల్లు శిరీష్ 2020 రీలోడెడ్

Update: 2020-03-09 05:07 GMT
అల్లు శిరీష్ కెరీర్ వ‌రుస ఫ్లాపుల‌తో సందిగ్ధం లో ప‌డిన సంగ‌తి తెలిసిందే. త‌న వెంట మంది మార్బ‌లం ఉన్నా.. ఊహించ‌ని కొన్ని త‌ప్ప‌ట‌డుగులు ఇబ్బంది పెట్టాయి. కెరీర్ ఎక్క‌డ వేసిన గొంగ‌లి అక్క‌డే అన్న చందంగా ఉంది. ఏడేళ్ల కెరీర్ లో చేసిన 5 సినిమాలు చేస్తే రెండు చిత్రాలు మాత్ర‌మే యావ‌రేజ్ గా ఆడాయి. న‌టుడిగా పాస్ అయ్యాడా? అంటే చెప్ప‌డం క‌ష్ట‌మే. యావ‌రేజ్ గా ఆడిన ఆ రెండు చిత్రాలు కూడా మారుతి(కొత్త‌జంట‌)... ప‌ర‌శురాం( శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు) ల మ్యాజిక్ వ‌ల్ల సోసోగా న‌డిచిపోయాయి. దీంతో తెలుగు స్క్రిప్టుల‌పై న‌మ్మ‌కం కోల్పోయిన శిరీష్ వీళ్ల‌తో లాభం లేద‌నుకుని ఎలాగైనా హిట్టు కొట్టి సత్తా చాటాల‌ని గ‌తేడాది మ‌ల‌యాళం హిట్ సినిమా `ఏబీసీడీ`ని రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఆ సినిమా బాక్సాఫీస్ ఫ‌లితం తెలిసిందే. డాడ్ అల్లు అరవింద్ లాంటి గ్రేట్ స్క్రిప్టు డాక్ట‌ర్ ఉన్నా..బ‌న్నీ లాంటి స్టార్ హీరో స‌హ‌కారం ఉన్నా.. స‌క్సెస్ అన్న‌ది అంద‌ని ద్రాక్ష అయ్యింది. శిరీష్ కెరీర్ ట్రాక్ ని మాత్రం మార్చ‌లేక‌పోయారు. అయితే త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు ఇంత‌కుముందు శిరీష స్పందించాడు. స‌డెన్ గా వ‌న్ ఫైన్ డే .. చూస్తూ ఉండండి బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో స‌త్తా చాటుతాన‌ని కాస్త పౌరుషంగానే అన్నాడు. 2020లో ఏకంగా రెండు సినిమాల‌తో ప్రారంభించేందుకు సీరియ‌స్ గానే క‌స‌ర‌త్తు చేశాడ‌ట‌. ప్ర‌స్తుతం ఇద్ద‌రు ద‌ర్శ‌కుల‌తో క‌థా చ‌ర్చ‌లు సాగుతున్నాయ‌ట‌. అతి త్వ‌ర‌లోనే అందులో ఓ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడ‌ని స‌మాచారం. ఈ రెండు చిత్రాల‌ని అరవింద్ స్వ‌యంగా నిర్మించే అవ‌కాశాలు న్నాయ‌ని అంటున్నారు.

మ‌రి ఆ రెండు చిత్రాల ద‌ర్శ‌కుల వివ‌రాలు మాత్రం ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. శిరీష్ ఇప్ప‌టి వర‌కూ మంచి టెక్నీషియ‌న్ల‌నే ఎంపిక చేసుకున్నాడు. కంటెంట్ ప‌రంగా ఫెయిల‌వ్వ‌డంతో ఆ ద‌ర్శ‌కులంతా తేలిపోయారు త‌ప్ప‌! మేకింగ్ ప‌రంగా పెద్ద‌గా త‌ప్పిదాలేవీ దొర్ల‌లేదు. మ‌రి ఈసారి కాస్త భిన్నంగా కొత్త కుర్రాళ్ల‌ను ప‌రిచ‌యం చేస్తున్నాడా? లేక డాడ్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ల‌నే సెట్ చేసారా? అన్న‌ది అతి త్వ‌ర‌లోనే తెలుస్తుంది. ఛాలెంజింగ్ గా తీసుకుని ష్యూర్ షాట్ గా హిట్టు కొట్టి ప్రూవ్ చేయాల్సిన సంద‌ర్భమిది. శిరీష్‌ ఏం చేస్తాడో చూడాలి.
Tags:    

Similar News