గ్యాంగ్ స్టర్ కథాంశం నేపథ్యంలో `సర్కార్` ఫ్రాంఛైజీలో తొలి రెండు సినిమాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్- జాకీష్రాఫ్- మనోజ్ భాజ పాయ్ లాంటి దిగ్గజాలతో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సర్కార్ 3 కొన్ని సంవత్సరాల క్రితం విడుదలైంది. అయితే ఈ ఫ్రాంచైజీలో మొదటి రెండు భాగాలు హిట్టయినట్టు మూడో భాగం ఆదరణ పొందడంలో విఫలమైంది. దాంతో సంబంధం లేకుండా నిర్మాత ఆనంద్ పండిట్ ఇటీవలే ఈ గ్యాంగ్ స్టర్ ఫ్రాంఛైజీలో మరో సినిమా (సర్కార్ 4) ఉంటుందని ప్రకటించారు. ఈ చిత్రానికి అనంద్ పండిట్-అమితాబ్ నిర్మాతలు గా కొనసాగే అవకాశం ఉంది.
అలాగే అభిషేక్ బచ్చన్ నటించిన `ది బిగ్ బుల్`కి సీక్వెల్ తెరకెక్కించే ఆలోచన ఉందని నిర్మాత ఆనంద్ పండిట్ వెల్లడించారు. నిజ జీవిత స్కామ్ నుండి ప్రేరణ పొంది తెరకెక్కించిన ఈ సినిమా OTTలో విడుదలై సానుకూల సమీక్షలను పొందింది. ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీని ముందుకు తీసుకెళ్లాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఈసారి ఒక పుస్తకం ఆధారంగా సీక్వెల్స్ తెరకెక్కించనున్నారు.
తాజా ఇంటర్వ్యూలో నిర్మాత ఆనంద్ పండిట్ ఈ రెండు ఫ్రాంచైజీలను ముందుకు తీసుకెళతామని అధికారికంగా వెల్లడించారు. సర్కార్ గురించి మాట్లాడుతూ- ``మేము రెండు-మూడు ఫ్రాంచైజీ ప్రాజెక్ట్ లపై సీరియస్ గా ఆలోచిస్తున్నాం. వాటిపై పని చేస్తున్నాం. మేము సర్కార్ 4 చేయగలమని ఆశిస్తున్నాం`` అని అన్నారు. ది బిగ్ బుల్ సీక్వెల్ మాట్లాడుతూ బిగ్ బుల్ 2 కోసం పని చేస్తున్నామని ఒక పుస్తకం హక్కులను కొనుగోలు చేసే పనిలో ఉన్నామని కూడా వెల్లడించారు. మేము (తదుపరి) స్కామ్ సీక్వెల్ గురించి ఎక్కువగా వెల్లడించలేం. మేము బిగ్ బుల్ 2 గురించి మాదైన మార్గంలో ఆలోచిస్తున్నామని తెలిపారు.
అయితే ఈ సినిమాల కాస్టింగ్ గురించి నిర్మాత మౌనం వహించారు. అభిషేక్ బచ్చన్ మరోసారి సీక్వెల్ లో భాగమవుతాడో లేదో చూడాలి. ``నేను అభిషేక్ బచ్చన్ తో కలిసి పనిచేయడానికి ఇష్టపడతాను. అతను గొప్ప నటుడు. అయితే స్క్రిప్ట్ ని బట్టి నటీనటులను నిర్ణయిస్తాం`` అని నిర్మాత నర్మగర్భంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. సర్కార్ 3 ఫ్లాప్ అయినందున ఇప్పుడు ఆర్జీవీకి పార్ట్ 4 తీసే అవకాశం కల్పిస్తారా? అన్నది చర్చగా మారింది.
సర్కార్ 3 గురించి మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్- యామీ గౌతమ్- జాకీ ష్రాఫ్- మనోజ్ బాజ్‌పాయ్ తదితరులు నటించారు. ఇది తొలి రెండు భాగాలకు కొనసాగింపు కథతో వచ్చింది. మరోవైపు 8 ఏప్రిల్ 2021న డిస్నీ+హాట్ స్టార్ లో ది బిగ్ బుల్ స్ట్రీమింగ్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అభిషేక్ బచ్చన్ తో పాటు ఇలియానా డిక్రూజ్- నికితా దత్తా తదితరులు నటించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.