పొట్టి నిక్క‌రు చిట్టి గౌనులో గాయ‌ని కం న‌టి

Update: 2023-02-11 07:00 GMT
గాయ‌ని కం న‌టి ఆండ్రియా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ప్ర‌ముఖ సంగీత‌ద‌ర్శ‌కుడు అనిరుధ్ తో ప్రేమాయ‌ణం సాగించి చివ‌రికి బ్రేక‌ప్ తో డిప్రెష‌న్ ని ఫేస్ చేసింద‌ని త‌మిళ మీడియాల్లో క‌థ‌నాలొచ్చాయి. కానీ వేటినీ ఆండ్రియా ధృవీక‌రించ‌లేదు. చాలా కాలం త‌న ఒత్తిళ్ల జీవితం గురించి అనారోగ్యం గురించి క‌ల‌త చెందాన‌ని ఇంత‌కుముందు వెల్ల‌డించినా కానీ ఇప్పుడు అన్నివిధాలా కెరీర్ పైనే ఆండ్రియా దృష్టి సారించింది.

సింగ‌ర్ కం న‌టి ఆండ్రియా కేవ‌లం హాట్ హీరోయిన్ గానే కాదు.. త‌న‌దైన‌ హ‌స్కీ వాయిస్ తో తెలుగు ప‌రిశ్ర‌మ‌కు పాట‌లు పాడి స్పెల్ బౌల్డ్ చేసిన సంగ‌తి తెలిసిందే. చెన్న‌య్ టు హైద‌రాబాద్ ఆండ్రియాకి గాయ‌నిగానే బోలెడంత పాపులారిటీ ఉంది. ఇంత‌కుముందు నాగ‌చైత‌న్య 'ద‌డ‌' స‌హా ప‌లు తెలుగు చిత్రాల్లో త‌న‌దైన గానంతో అల‌రించింది.

హ‌స్కీ వాయిస్ తో కిక్కిచ్చే గానం ఆండ్రియాకి పేరు తెచ్చింది. 'యుగానికి ఒక్క‌డు' చిత్రంతో కథానాయిక‌గా స్పైసీ లుక్ తో అల‌రించింది. ఆండ్రియా న‌టించిన వరుస చిత్రాలు తెలుగులో విడుద‌ల‌య్యాయి. కొన్ని డ‌బ్బింగులు ఆక‌ట్టుకున్నాయి. కానీ ఎందుక‌నో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెల‌గాల‌ని క‌ల‌లు గ‌న్న ఈ బ్యూటీ ర‌క‌ర‌కాల వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో రేసులో వెన‌క‌బ‌డింది.  

మరోవైపు ఆండ్రియా సోష‌ల్ మీడియాల్లోను యాక్టివ్ గా ఉంది. ఒంట‌రి బీచ్ లో సుదూర తీరంలో ఇలా పొట్టి నిక్క‌రుతో ప్ర‌త్య‌క్ష‌మై కుర్ర‌కారు గుండెల్లో గుబులు పెంచింది. వైట్ డెనిమ్ షార్ట్..  కాంబినేష‌న్ గా చిట్టి పొట్టి గౌన్ ని ధ‌రించిన ఆండ్రియా బీచ్ లో న‌వ్వులు చిందిస్తూ కుర్ర‌కారు గుండెల్ని గిచ్చేస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

లైఫ్ జ‌ర్నీలో గంద‌ర‌గోళం నుంచి బ‌య‌ట‌ప‌డిన ఆండ్రియా ఇటీవ‌ల  పూర్తిగా కెరీర్ పైనే శ్ర‌ద్ధ పెట్టింది. ఇంత‌కుముందు మాస్ట‌ర్ చిత్రంలో ఆండ్రియా కీల‌క పాత్ర‌లో క‌నిపించింది. ఇటీవ‌ల నాలుగైదు చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. ఇవ‌న్నీ సెట్స్ లో ఉన్నాయి.

క‌మ‌లా క‌న్న‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 'వ‌ట్టామ్'.. మిస్కిన్ ద‌ర్శ‌క‌త్వంలో 'పిసాసు-2' లో న‌టిస్తోంది. వీట‌న్నిటికీ సంబంధించిన తాజా అప్ డేట్లు రావాల్సి ఉంది. కా - మాలిగై- నో ఎంట్రీ స‌హా మ‌రో రెండు చిత్రాల్లోను ఆండ్రియా న‌టిస్తూ బిజీగా ఉంది.   



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News