బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసులో డ్రగ్స్ వ్యవహారం బయటకు రావడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి - ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి - సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరండా - సహాయకుడు దీపేష్ సావంత్ లను అరెస్ట్ చేశారు. వీరితో పాటు డ్రగ్స్ మాఫియాతో లింకులున్న జాయేద్ విలాట్రా - అబ్దెల్ బాసిత్ పరిహార్ - కైజన్ ఎబ్రహీం - కర్ణా అరోరా - అనుజ్ కేశ్వీనీ - అబ్బాస్ లఖానీ లను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అధికారులు మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
కాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఈ కేసులో కరన్ జీత్ అలియాస్ కేజే అనే ఈ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో అతన్ని అరెస్టు చేసినట్లు ఎన్సీబీ అధికారులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా బయటపడిన డ్రగ్స్ దందాలో కరన్ జీత్ కూడా మెంబెర్ అని ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. కరన్ జీత్ సౌత్ ముంబైలోని తమ ఆఫీసుకు తరలించి ప్రశ్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తాజా అరెస్ట్ తో కలిపి సుశాంత్ సింగ్ మృతికి సంబంధించి అరెస్టుల సంఖ్య 11కు చేరుకుంది. రియా చాలామంది సినీ ప్రముఖుల పేర్లు వెల్లడించిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉంది.