ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్

Update: 2021-11-04 04:08 GMT
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ పై విడుదలై ఊపిరి పీల్చుకున్నాడు. దాదాపు 27 రోజులకు పైగా అతడు డ్రగ్స్ కేసులో జైల్లో ఉన్నాడు. ముంబై క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ పార్టీలో పట్టుబడి ఎన్సీబీ ఆరోపణలో ఆర్యన్ కు బెయిల్ దక్కలేదు. సుప్రీంకోర్టు దిగ్గజ లాయర్ ముకుల్ రోహత్ గీ ఎట్టకేలకు బలమైన వాదన వినిపించి బెయిల్ ఇప్పించారు.

తాజాగా ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు అనూహ్య మైన మలుపు తిరిగింది. డ్రగ్స్ కేసులో ముడుపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న శామ్ డిసౌజా మరో కొత్త విషయాన్ని బయటపెట్టాడు. ఎన్సీబీ అధికారులు నౌకపై దాడి చేసిన తర్వాత ఆర్యన్ ఖాన్ ను విడిచిపెట్టడానికి ఆ కేసులో సాక్షి అయిన కిరణ్ గోసావి ఏకంగా షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజ దాడ్లాని దగ్గర నుంచి రూ.50 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు.

అయితే ఎన్సీబీ మాత్రం ఆర్యన్ ను అరెస్ట్ చేయడంతో తిరిగి ఆ డబ్బులు ఇచ్చేశారని ఈ డీల్ కు మధ్యవర్తిత్వం వహించినట్టుగా అనుమానాలున్నాయని శామ్ విల్లి డిసౌజా ఆరోపించారు.

ఇప్పటికే ఆర్యన్ ను విడిచిపెట్టడానికి ఎన్సీబీ అధికారుల తరుఫున మధ్యవర్తులు రూ.25 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల్లో వాస్తవాలను నిగ్గు తేల్చడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది.

ఈ క్రమంలోనే తనను సిట్ అరెస్ట్ చేస్తుందన్న భయంతో బాంబే హైకోర్టులో శామ్ డిసౌజా ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని హైకోర్టు తిరస్కరించింది. కిరణ్ గోసావి, ప్రభాకర్ సాయిల్ ఈ కేసులో సాక్షులు కారని.. వారే అసలు సిసలైన కుట్రదారులని డిసౌజా ఆరోపించారు.

 క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీ రైడ్ కేసులో సాక్షిగా  నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) కి దొరికిన సాక్షి కిరణ గోసావి  ఎన్సీబీపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.   ఆర్యన్ ఖాన్‌ను విడుదల చేయడానికి బాలీవుడ్ మెగాస్టార్ షారూఖ్ ఖాన్ నుంచి రూ.25 కోట్ల లంచం డిమాండ్ చేసినట్లు సాక్షి  ఆరోపించారు.

ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నుంచి తనకు ప్రాణహాని ఉందని.. భయంగా ఉందని ఈ కేసులో సాక్షిగా ఉన్న ప్రభాకర్ సెయిల్ వివిధ టీవీ ఛానళ్లలో బహిరంగంగా చెప్పడంతో పెద్ద దుమారమే రేగింది. ప్రైవేట్ డిటెక్టివ్ అని పిలవబడే కిరణ్ పి. గోసవి వ్యక్తిగత అంగరక్షకుడిగా గుర్తింపు పొందిన సెయిల్ ఈ డ్రగ్స్ కేసులో కీలక సాక్షిగా ఉన్నారు. ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేసిన అక్టోబర్ 2న ఆర్యన్ ఖాన్, ఇతరుల అరెస్టుకు సంబంధించిన సంతకం చేసిన అఫిడవిట్ స్టేట్‌మెంట్, వీడియోలను సెయిల్ విడుదల చేయడంతో ఈ కేసు అనూహ్య మలుపు తిరిగింది.

ఎన్‌సీబీ జాబితా చేసిన 9 మంది సాక్షులలో సెయిల్ ఒకరు. ఏజెన్సీ ద్వారా 10 ఖాళీ కాగితాలపై తనతో సంతకం చేయించారని.. ఇప్పుడు వాంఖడే నుండి తన ప్రాణాలకు భయం ఉందని సెయిల్ ఆరోపిస్తున్నాడు.
Tags:    

Similar News