అక్కడ సమర.. ఇక్కడ అఘోర!

Update: 2020-02-09 14:30 GMT
యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన బోయపాటి శ్రీను ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు.  బోయపాటి - బాలయ్య కాంబినేషన్లో తెరకెక్కిన రెండు సినిమాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.  దీంతో ఈ హ్యాట్రిక్ చిత్రంపై అభిమానులు అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో బాలయ్య డబల్ రోల్ ఉంటుంది.. అందులో ఒకటి అఘోర పాత్ర అని ఇప్పటికే వార్తలు వచ్చాయి.  తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా కథ బాలయ్య సూపర్ హిట్ చిత్రం 'సమరసింహారెడ్డి' సినిమాకు దగ్గరగా ఉంటుందని అంటున్నారు. 'సమరసింహారెడ్డి' ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో బాలయ్య ఫ్యాక్షనిస్టుగా కనిపిస్తారు కదా. ఇక్కడ కూడా అలాగే ఫ్లాష్ బ్యాక్ లో ఫ్యాక్షనిస్టుగా కనిపిస్తారట.  మిగతా సినిమాలో అఘోరాగా ఉంటారట. ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్యకు నయనతార జోడీగా నటిస్తుందని...  ఈ ఆఘోరా గెటప్ బాలయ్యకు దగ్గర కాథరిన్ ట్రెసా ఉంటుందట. ఈ సినిమాలో 'సమరసింహారెడ్డి' స్థాయిలో ఎమోషన్స్ పండించాలనే ఆలోచనతోనే ఇంటెన్స్ గా ఉండే అఘోర ఎపిసోడ్ ప్లాన్ చేశారని టాక్ ఉంది. ఈ కీలకమైన అఘోరా ఎపిసోడ్ ఫస్ట్ షెడ్యూల్ లోనే చిత్రీకరిస్తారట.  ఈ షెడ్యూల్ వారణాసిలో ఫిబ్రవరి 26 నుండి ప్రారంభం కానుందని సమాచారం.

బాలయ్య-బోయపాటి కాంబినేషన్ పై అంచనాలు ఉన్నాయి కానీ ఈ అఘోర ఎపిసోడ్ పై మాత్రం నందమూరి అభిమానుల్లో కొన్ని సందేహాలు ఉన్నాయట.  ఈ సినిమా విజయం బాలయ్యకు కీలకమని.. తేడాగా కాకుండా జాగ్రత్తగా సినిమాను తెరకెక్కించాలని ఇప్పటికే అభిమానులు బోయపాటికి మెసేజులు పెడుతున్నారని టాక్ వినిపిస్తోంది. 

   

Tags:    

Similar News