ఛార్మి పిటీష‌న్‌ లో ఏముంది?

Update: 2017-07-25 04:26 GMT
సంచ‌ల‌నాల మీద సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న డ్ర‌గ్స్ విచార‌ణ ఉదంతంలో ప్ర‌ముఖ న‌టి ఛార్మి వైఖ‌రి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. డ్ర‌గ్స్ విచార‌ణ‌లో నోటీసులు అందుకున్న సినీ ప్ర‌ముఖుల్లో ఆమె ఒక‌రు. సినీ రంగానికి చెందిన 12 మందికి అబార్కీ శాఖ నోటీసులు జారీ చేస్తే.. అందులో ఇద్ద‌రు మాత్ర‌మే మ‌హిళ‌లు. వారిలో ఒక‌రు ఛార్మి కాగా మ‌రొక‌రు ముమైత్ ఖాన్‌.

డ్ర‌గ్స్ విచార‌ణ‌లో త‌న‌పై ఆరోప‌ణ‌ల‌తో నోటీసులు జారీ చేసిన అధికారుల‌పై ఛార్మి హైకోర్టును ఆశ్ర‌యించ‌ట‌మే కాదు.. విచార‌ణ జ‌రుగుతున్న తీరుపైన అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు. అధికారులు గోళ్లు.. ర‌క్త‌పు న‌మూనాలు సేక‌రించ‌టంపైనా ఆమె అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ.. రూల్ బుక్ లోని సెక్ష‌న్ల‌ను కోట్ చేశారు. ఇష్టం లేకుండానే న‌మూనాలు సేక‌రిస్తున్నారని.. ఇది రాజ్యాంగ విరుద్ధ‌మని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా హైకోర్టుకు ఒక పిటీష‌న్ దాఖ‌లు చేశారు. మ‌రి.. ఆ పిటీష‌న్ లో ఏముందన్న విష‌యంలోకి వెళితే..

= నా అస‌లు పేరు స‌ర్ దీప్ కౌర్ ఉప్ప‌ల్‌. వ‌య‌సు 30 ఏళ్లు. ఛార్మి కౌర్‌ గా అంద‌రికీ ప‌రిచ‌యం

= నటి.. నిర్మాతగా తెలుగు - తమిళ - మలయాళ - కన్నడ - హిందీ సినిమాలకు సేవలందించా

= వివిధ భాషల్లో 50కి పైగా సినిమాల్లో నటించా. తెలుగులో రెండుసార్లు నంది అవార్డు అందుకున్నా

= మాది పేరు ప్రతిష్ఠలున్న గౌరవప్రదమైన కుటుంబం. షూటింగ్‌ లకు వెళ్లేటప్పుడు నాతోపాటు కుటుంబసభ్యుల్లో ఒకరు తోడుగా ఉంటారు

=  మద్యం.. డ్రగ్స్‌ వినియోగం వంటి దురలవాట్లు లేవు

=  సినిమా రంగంలోని ఓ వర్గంతోపాటు మీడియాలో కొంతమంది నాపై నిరాధార ఆరోపణలు ప్రచారం చేస్తున్నారు

= దీంతో నా ప్రతిష్ఠ దెబ్బతింటోంది. ఓ వర్గం మీడియాలో వస్తున్న ఆరోపణలతో నాకు సంబంధం లేకున్నా.. డ్రగ్స్‌ కేసులో విచారణకు హాజరుకావాలంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు

= ఈ ఆరోపణలతోగానీ, డ్రగ్స్‌ నిందితులతోగానీ నాకెలాంటి  సంబంధం లేదు

= నా తల్లిదండ్రులు ఇక్కడ నివాసం ఉండటంలేదు

= స్నేహితులెవరూ విచారణ సందర్భంగా నాతో రావడానికి సిద్ధంగా లేనందున సాయం కోసం నా న్యాయవాదిని అనుమతించేలా ఆదేశించండి

=  మీడియాలో వస్తున్న కథనాల మేరకు పలువురు సినిమావారి నుంచి రక్తం - గోళ్లు - వెంట్రుకల నమూనాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది

=  అనుమతి లేకుండా వాటిని తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధం. అంతేకాకుండా అవివాహితనైన నేను దీనివలన సమాజంలో విపరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది

=  అందువల్ల సుప్రీంకోర్టు మార్గదర్శకాలు - రాజ్యాంగం ప్రకారం విచారణ జరిపేలా - న్యాయవాది సమక్షంలోనే జరిగేలా అదేశాలివ్వండి
Tags:    

Similar News