ప్రభు సాలమన్ దర్శకత్వం లో రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్న చిత్రం 'అరణ్య'. బహుభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ ప్రారంభం అయ్యాయి. తాజాగా ఈ సినిమా నుండి చిటికేసె ఆ చిరుగాలి అంటూ సాగే పాటను విడుదల చేశారు.
ఈ సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ శంతను మోయిత్రా సంగీతం అందిస్తున్నారు. ఈ పాటకు సాహిత్యం అందించినవారు వనమాలి. పాడినవారు హరిచరణ్. 'చిటికేసే ఆ చిరుగాలి చిందేసి ఆడే నెమలి కిలకిలమని కోకిల వాలి పాడెనులె హాయిగ లాలి.. అడివంత ఒకటై ఆహ్వానమే పలకనీ ఆడనీ పాడనీ చిందులే వెయ్యని" అంటూ వనమాలి ఎంతో సింపుల్ పదాలతో మ్యాజిక్ చేశారు. హాయిగా అనిపించే ట్యూన్ కు సూట్ అయ్యేలా హరిచరణ్ కూడా ఎంతో ఆహ్లాదకరంగా పాడారు.
రానా ఈ సినిమాలో ఒక ఏనుగుల మధ్య ఉండే అడవిమనిషిగా నటిస్తున్నాడు. హ్యాండ్సమ్ హంక్ లాగా కనిపించే రానా ఈ సినిమాల పొడవాటి గడ్డం తో మాసిన మాసిన బట్టలతో మొరటుగా ఉన్నాడు. ఈ సినిమా కోసం దట్టమైన అడవుల్లో ప్రతికూల పరిస్థితుల మధ్య షూటింగ్ జరిపారని సమాచారం. ఈరోస్ ఇంటర్నేషనల్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ.. తమిళంలో ఒకేసారి రిలీజ్ అవుతోంది. అంతలోపు ఈ చిటికేసే ఆ చిరుగాలిపై ఓ లుక్కెయ్యండి!