ప్రభాస్ సినిమాలో సల్మాన్ గురించి క్లారిటీ

Update: 2019-05-24 06:19 GMT
నిన్నా మొన్న సాహోలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ క్యామియో చేశాడన్న వార్త కాస్త గట్టిగానే ప్రచారం అయ్యింది. ఇది అభిమానుల్లో నిజమనుకున్న వాళ్ళు లేకపోలేదు. ఇది కాస్త ఎక్కడికో వెళ్తుండటంతో దర్శకుడు సుజిత్ క్లారిటీ ఇచ్చాడు. ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ అసలు సల్మాన్ ఇందులో ఎలాంటి పాత్ర చేయలేదని షూటింగ్ పూర్తి కావొస్తున్న దశలో ఇలాంటి పుకార్లు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదని స్పష్టం చేశాడు.

ప్రభాస్ తప్ప ఇంకే హీరో ఇందులో కనిపించరని నొక్కి చెప్పాడు. సో సల్మాన్ ఉంటాడు సాహోకు ఇంకాస్త క్రేజ్ తోడవుతుంది అనే వార్తల్లో ఎలాంటి విశ్వసనీయత లేనట్టే. ఆగస్ట్ 15 డేట్ పక్కా చేసుకున్న సాహో పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటిదాకా సౌత్ లోనే కాదు ఇండియన్ స్క్రీన్ మీదే చూడని యాక్షన్ విన్యాసాలు ఇందులో ఉంటాయని ఇప్పటికే టాక్ బలంగా ఉంది. ప్రభాస్ పాత్ర తీరుతెన్నులు స్టొరీ లైన్ గురించి ఏ చిన్న లీక్ బయటికి రాకుండా టీం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.

శ్రద్ధా కపూర్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో నీల్ నితీష్-మందిరా బెడి-జాకీ శ్రోఫ్-మహేష్ మంజ్రేకర్ లాంటి బాలీవుడ్ తారాగణం భారీ సంఖ్యలో నటిస్తోంది. ఈ నేపధ్యంలో సల్మాన్ నిజంగా ఉన్నా పెద్దగా ప్రయోజనం ఉండదు. పైగా బాహుబలి లాంటి ప్రభాస్ ఉండగా ఇంకెవరి సపోర్ట్ ఎందుకనేది ఫాన్స్ వెర్షన్. అతి త్వరలో కొత్త టీజర్ విడుదల చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోంది

    

Tags:    

Similar News