`వాల్మీకి` టైటిల్ మార్పు అంశం పదే పదే చర్చకు వస్తోంది. ఇటీవల ఎప్పుడూ ఇలా చివరి నిమిషంలో టైటిల్ మార్చింది లేదు. సమస్య చాలా ముందు నుంచి తెలిసినదే అయినా టైటిల్ మార్పు విషయంలో దర్శకనిర్మాతలు మొండి వైఖరిని అవలంబించి చివరి నిమిషంలో లేనిపోని చిక్కులు తెచ్చుకున్నారని తప్పు మీద తప్పు చేసి దొరికిపోయారని విమర్శలొస్తున్నాయి. నిన్న సాయంత్రం అప్పటికప్పుడు అర్జెంట్ ప్రెస్ మీట్ అంటూ 14 రీల్స్ ప్లస్ వాళ్లు మీడియాని కంగారు పెట్టేయాల్సిన పరిస్థితి వచ్చింది.
వాస్తవానికి బోయ వాల్మీకి కులస్తులు టైటిల్ మార్చాలంటూ పోరాటంలో స్పీడ్ పెంచింది కనీసం 15 రోజులు పైగానే అయ్యింది. అంటే ఈలోగానే ఒక మెట్టు దిగి వచ్చి టైటిల్ ని మార్చే ప్రయత్నం చేసి ఉంటే చివరి నిమిషంలో హైరానా పడాల్సిన అవసరం ఉండేది కాదని భావిస్తున్నారు. అప్పటికప్పుడు కలెక్టర్ల ఆదేశంతో రెండు జిల్లాల్లో ప్రదర్శన నిలిపేయడంతో డిస్ట్రిబ్యూటర్లు ఖంగు తినాల్సి వచ్చింది. ఇదంతా హరీష్ లోని మొండితనాన్ని నిర్మాతలు ఎక్కించుకోవడం వల్లనే అనుకోవాలి. షూటింగ్ దశలోనే హీరో క్యారెక్టరైజేషన్ నెగెటివ్ గా ఉందని తెలిసిన బోయ కార్మికులు వివాదానికి తెర తీశారు. వాల్మీకి టైటిల్ ని మార్చాల్సిందిగా కోరారు. కానీ పట్టించుకోకపోవడంతో రిలీజ్ ముంగిట చివరి క్షణంలో ఇన్ని పాట్లు పడాల్సి వచ్చింది. కనీసం మైత్రి వాళ్లు ఇంతకుముందు `గ్యాంగ్ లీడర్` ని కాస్తా.. `నానీస్ గ్యాంగ్ లీడర్` గా మార్చారు. అలాంటి ప్రయత్నం అయినా చేయలేదు.
లాస్ట్ మినిట్ టైటిల్ మార్పునకు అంగీకరిస్తూ కోర్టుకు వివరణ ఇవ్వాల్సొచ్చింది. అటుపై పరుగు పరుగున కొత్త టైటిల్ కార్డ్ ని రెడీ చేయించాల్సి వచ్చింది. కానీ ఏం లాభం .. క్యూబ్ లో టైటిల్ మార్పు అంటే నిమిషాలపై అయ్యేది కాదు.. పైగా ఖర్చుతో కూడుకున్నది. అయినా తప్పలేదు. ఎట్టకేలకు వాల్మీకి టైటిల్ మార్చుకుని `గద్దలకొండ గణేష్` పేరుతో నేడు(శుక్రవారం) రిలీజ్ చేశారు. మరి కాసేపట్లో `వాల్మీకి` పూర్తి రివ్యూ కోసం `తుపాకి`లో ఈ స్పేస్ ని ఫాలో అవ్వండి.