ఆంథాలజీ సిరీస్ లతో ఓటీటీ హీటెక్కుతున్న సంగతి తెలిసిందే. లస్ట్ స్టోరీస్.. ఘోస్ట్ స్టోరీస్.. బాంబే టాకీస్ లాంటి ఆంథాలజీలు విజయం సాధించాయి. ఇప్పుడు పిట్టకథలు పేరుతో నెట్ ఫ్లిక్స్ తెలుగులో ఇప్పటికే వెబ్ సిరీస్ స్ట్రీమింగుకి సిద్ధమవుతుంటే.. అటు తమిళంలోనూ డిఫరెంట్ స్టోరీస్ తో కుట్టి స్టోరీ ఆంథాలజీ రిలీజవుతోంది. ఇందులో ఒక స్టోరీలో ప్రధాన పాత్రధారి విజయ్ సేతుపతి ‘కుట్టి స్టోరీ’ విడుదల తేదీని వెల్లడించారు.
'కుట్టి స్టోరీ' ‘నాలుగు ప్రేమకథల కాక్టెయిల్’ అన్న సంగతి ఇంతకుముందు విడుదలైన ట్రైలర్ చూస్తే అర్థమైంది. ఇది ఆసక్తికర కథల సమాహారం.
కుట్టి స్టోరీ అనే ఆంథాలజీ చిత్రానికి తమిళ దర్శకులు గౌతమ్ మీనన్- వెంకట్ ప్రభు- ఎఎల్ విజయ్- నలన్ కుమారసామి దర్శకత్వం వహించారు. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నిర్మించింది. నాలుగు ప్రేమకథల సంకలనం తో ట్రైలర్ ఆన్ లైన్ లో విడుదల చేసారు.
ఈ చిత్రం ఫిబ్రవరి 12 న వాలెంటైన్స్ డే వారాంతపు ట్రీట్ గా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సిరీస్ షూటింగ్ గత సంవత్సరం లాక్ డౌన్ కాలంలో జరిగింది. ఒక ప్రముఖ OTT ప్లాట్ ఫామ్ కోసం దీనిని తయారు చేస్తున్నట్లు మొదట్లో ప్రకటించినప్పటికీ మేకర్స్ తరువాత థియేట్రికల్ విడుదల చేస్తామని ప్రకటించారు.
సేతుపతి .. గౌతమ్ మీనన్,.. అమలా పాల్,.. అమితాష్, .. మేఘా ఆకాష్, ..వరుణ్, .. సాక్షి అగర్వాల్ .. అదితి బాలన్ ఇందులో తారాగణం. నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించిన ఒక విభాగంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ కథలో అదితి బాలన్ నాయిక. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఒక విభాగంలో అతను ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఇందులో అమలా పాల్ కథానాయికగా కనిపించనుంది.
వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన కథలో వరుణ్- సాక్షి అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఎఎల్ విజయ్ దర్శకత్వం వహించిన వేరొక కథలో మేఘా ఆకాష్ ప్రధాన పాత్ర పోషించారు. పిసి శ్రీరామ్ కెమెరా వర్క్ - శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ అస్సెట్ కానున్నాయి. దీనికి కార్తీక్- మధు ఆర్- ప్రేమ్ గి అమరేనా- ఎడ్విన్ లూయిస్ విశ్వనాథ్ సంగీతం అందించారు. మనోజ్ ప్రమహంస- అరవింద్ కృష్ణ- శక్తి శరవణన్- ఎన్ షణ్ముగ సుందరం సినిమాటోగ్రఫీ అందించారు.