నెట్ ఫ్లిక్స్ కు హైకోర్టులో చుక్కెదురు?

Update: 2021-08-14 07:30 GMT
ప్రపంచ ప్రఖ్యాత ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ కు చుక్కెదురైంది. ఢిల్లీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బాలుడి మృతికి సంబంధించిన డాక్యుమెంటరీ ప్రసారం కేసులో నెట్ ఫ్లిక్స్ కు ధర్మాసనం కీలక ఆదేశాలిచ్చింది. ఆగస్టు 6న విడుదల చేసిన డాక్యుమెంటరీని నిలిపివేయాలంటూ ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ కు ఆదేశాలిచ్చింది.

పాఠశాలకు సంబంధించిన అన్ని సన్నివేశాలను తొలగించిన తర్వాత ఈ డాక్యుమెంటరీని ప్రసారం చేయవచ్చంటూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.

గురుగ్రామ్ కు చెందిన ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ వాష్ రూమ్ లో 7 ఏళ్ల బాలుడు 2018 జనవరి 8న దుర్మరణం చెందాడు. ఆ మరణం ఆధారంగా నెట్ ఫ్లిక్స్ పలు సంస్థల భాగస్వామ్యంతో ‘ఏ బిగ్ లిటిల్ మర్డర్’ అనే డాక్యుమెంటరీని రూపొందించింది. ఆగస్టు 6న లైవ్ స్ట్రీమింగ్ లో విడుదల చేసింది.

అయితే ఆ పాఠశాలలో తమ పాఠశాల పేరును ప్రస్తావిస్తున్నారని.. ఆ డాక్యుమెంటరీని నిలిపివేయాలంటూ ఇంటర్నేషనల్ స్కూల్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ఆ డాక్యుమెంటరనీ ప్రదర్శించకుండా నిలిపివేయాలని నెట్ ఫ్లిక్స్ , భాగస్వామ్య సంస్థలను ఆదేవించింది.

పాఠశాలకు సంబంధించిన అన్ని విషయాలను తొలగించిన తర్వాత ప్రదర్శనను ప్రసారం చేయవచ్చని కోర్టు తీర్పు చెప్పింది. పిల్లలపై ఈ డాక్యుమెంటరీ ప్రభావితం చేసేలా ఉండకూడదని తెలిపింది. స్ట్రీమ్ చేయవచ్చు కానీ పాఠశాల భవనం, విజువల్స్ తీసివేయాలని పేర్కొంది.




Tags:    

Similar News