`వ‌కీల్ సాబ్` ఎఫెక్ట్...ఆ డైరక్టర్ పై ఫుల్ ప్రెజర్?

Update: 2021-04-11 12:30 GMT
ఓ సినిమా హిట్టైనా,ప్లాఫ్ అయినా ఖచ్చితంగా ఆ తర్వాత అదే హీరోతో చేసే డైరక్టర్ పై ప్రెజర్ ఉంటుంది. ఫ్లాఫ్ అయితే తమ సినిమాకు పెద్దగా బిజినెస్ కాదు. దాంతో ఖర్చులు లిమిట్ చేయాలి. నిర్మాత మొదట కమిటైన బడ్జెట్ పెట్టడానికి కూడా నసుగుతూంటాడు. హీరో డల్ గా ఉంటాడు. అతనికి వాయిస్ ఉండదు. ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా తమ సినిమాపై ఉంటుంది. అదే హిట్టైతే ..ఆ హీరోతో తదుపరి సినిమా చేస్తున్న నిర్మాతలు పండగ చేసుకుంటారు. తమ సినిమాను ఆ స్దాయిలో అమ్మేసుకోవచ్చు అని. అయితే ఇక్కడ కూడా డైరక్టర్ కు ప్రెజరే. మొదట హిట్టైన సినిమాని రీచ్ అయ్యేలా తమ సినిమా ఉండాలి. కాదు కాదు..ఇంకాస్త ఎక్కువే ఉండాలి. ఎందుకంటే ఫ్యాన్స్ ఎక్సపెక్టేషన్స్ బాగా పెరిగిపోతాయి. ఇప్పుడు పవన్ తో సినిమా చేస్తున్న సాగర్ చంద్ర పరిస్దితి అదే అంటున్నారు.

బాలీవుడ్ పింక్ కి రీమేక్ గా వ‌చ్చిన సినిమా `వ‌కీల్ సాబ్`. మొన్న శుక్ర‌వారం విడుద‌లైన ఈ సినిమాకి అందరూ హిట్ రివ్యూలే ఇచ్చారు. కలెక్షన్స్ కుమ్మేస్తున్నారు. ప‌వ‌న్ ఫ్యాన్స్ అయితే లిటరల్ గా పండ‌గ చేసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తొలి రోజు భారీ వ‌సూళ్లు చూసి అందరూ నోరెళ్ల బెట్టారు. అమెరికాలో అయితే... వ‌కీల్ సాబ్ ప్ర‌భంజ‌నం కొనసాగుతోంది. ప్రీమియ‌ర్ షోల ద్వారా దాదాపుగా 2 కోట్ల పైమాటే లాగేసారు. కరోనా అమెరికాలో ఆంక్ష‌లు విప‌రీతంగా ఉన్నా,స‌గం థియేట‌ర్లు మూసేసినా దుమ్ము దులుపుతోంది. ఇదంతా ఖచ్చితంగా పవన్ స్టామినానే అని చెప్పాలి. ఈ నేపధ్యంలో పవన్, రానా లతో సినిమా చేస్తున్న సాగర్‌ కె. చంద్ర మరో సూపర్ హిట్టు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే సాగర్‌ కె. చంద్ర మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారట. ఎట్టిపరిస్దితుల్లోనూ పెద్ద హిట్ కొట్టబోతున్నామని నమ్ముతున్నారట.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -దగ్గుబాటి హీరో రానా కలిసి మలయాళం సూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్ చేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాగర్‌ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఇద్దరు హీరోలు, సక్సెస్ ఫుల్ సినిమా రీమేక్ కాబట్టి ఖచ్చితంగా ఎక్సపెక్టేషన్స్ ఓ రేంజిలో ఉంటాయి. ఇవన్ని సరిపోవన్నట్లు త్రివిక్రమ్ డైలాగులు . ఊహించండి..ఏ స్దాయిలో మూవీ ఉండాలో..ఉంటుందో... పి.డి.వి. ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.




Tags:    

Similar News